New Delhi, March 24: బ్రహ్మోస్ (BrahMos)సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఈ మేరకు భారత రక్షణ శాఖ (Defense Ministry) ఒక ప్రకటనలో వెల్లడించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అండమాన్ నికోబార్ దీవులలో బ్రహ్మోస్ క్షిపణని ఉపరితలం నుంచి ఉపరితలంపైకి విజయవంతంగా ప్రయోగించింది. బ్రహ్మోస్ అణు సామర్థ్యంతో కూడిన క్షిపణి, భూమి, ఉపరితలం గాలి నుంచి కూడా ప్రయోగించవచ్చు. ఈ క్షిపణి పరీక్ష విజయవంతం కావడంపై ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్. చౌదరి (VR Chaudhari )రక్షణ శాఖను అభినందించారు.ఈ విస్తృత శ్రేణి క్షిపణి ప్రయోగాన్ని ఇతర రక్షణ అధికారులు వీక్షించారు. అండమాన్ నికోబార్ దీవుల్లోనే ఉన్న ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ అక్కడి బలగాల కార్యాచరణ సంసిద్ధతను సమీక్షించారు. అలాగే యుద్ధ సన్నాహాలకు సంబంధించిన అంశాలపై కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎక్కువ దూరంలోని నిర్దేశిత లక్ష్యాన్ని క్షిపణి కచ్చితత్వంతో చేధించిందని అధికారులు వెల్లడించారు. అయితే ఈ క్షిపణి కచ్చితత్వంతో లక్ష్యాన్ని చేధించిందని అధికారులు వెల్లడించారు.

బ్రహ్మోస్ క్షిపణి కమాండ్ ఎయిర్ స్టాఫ్ ఇన్‌స్పెక్షన్ (CASI) సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీని కారణంగా ఆ క్షిపణి మిస్ ఫైర్ అయింది. క్షిపణి పాకిస్థాన్ భూభాగంలో పడటంతో ఆస్తి, సామగ్రికి చాలా తక్కువ నష్టం వాటిల్లింది. అయితే అక్కడి ప్రజలకు మాత్రం ఎలాంటి హాని లేదు. క్షిపణి మిస్ ఫైర్ ఘటనపై భారత్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వెంటనే పాక్ అధికారులకు లేఖ పంపింది.

BrahMos Cruise Missile: దుమ్మురేపిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్, 400 కిలోమీటర్ల దూరంలో ఏమున్నా భస్మీ పటలం చేసే శక్తి దీని సొంతం, మిసైల్‌ను ప్రయోగించడం రెండోసారి

దీనికి సంబంధించి ప్రకటన కూడా జారీ చేసింది. భారత క్షిపణి 124 కిలోమీటర్ల దూరంలో పాక్ భూభాగంలో దిగిందని పాక్ ప్రకటించిన తర్వాత భారత రక్షణ శాఖ నుంచి స్పష్టత వచ్చింది. పాక్ వైమానికి దళానికి చెందిన ఎయిర్ డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ దీనిని స్వాధీనం చేసుకుంది. పాక్ గగనతలాన్ని ఉల్లంఘించి మియాచన్ను సమీపంలో పడిందని ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తీకర్ తెలిపారు.