Credits: Twitter

Vijayawada, Dec 30: భారత ప్రధాని నరేంద్ర మోదీ (Indian Prime Minister Modi) మాతృమూర్తి హీరాబెన్ మోదీ (Heeraben Modi) తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. వందేళ్లు సంపూర్ణ జీవితాన్ని గడిపిన ఆమె అహ్మదాబాద్ లోని (Ahmadabad) ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ సందర్భంగా మోదీకి ప్రముఖులు సానుభూతిని తెలియజేస్తున్నారు.

తెలంగాణలో 783 పోస్టులకు గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు, అప్లై తేదీలు, అర్హతలకు సంబంధించిప పూర్తి వివరాలు ఇవే..

మోదీగారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ఏపీ సీఎం జగన్ (Jagan) అన్నారు. ఈ కష్ట సమయంలో తమ ప్రార్థనలు మోదీ కుటుంబంతో ఉంటాయని చెప్పారు. హీరాబెన్ మోదీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుతున్నానని ట్వీట్ చేశారు. తల్లిని కోల్పోవడం ఎవరికైనా అత్యంత బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) చెప్పారు.

సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల టైమ్ టేబుల్ విడుదల, ఫిబ్రవరి 15 నుంచి CBSE 10వ తరగతి పరీక్షలు

మాతృమూర్తిని కోల్పోయిన ప్రధాని మోదీకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు. మోదీ కుటుంబానికి భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని కలిగించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాని చెప్పారు. హీరాబెన్ మోదీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. హీరాబెన్ మృతి విచారకరమని, ఆమె కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు.