Rescue operation is still underway at the site. (Photo credits: Twitter/ANI)

Patna, February 1:  జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో గత రాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 14 మంది సజీవ దహనమయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. బహుళ అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ఘటన జరిగినట్టు ముఖ్య కార్యదర్శి సుఖ్‌దేవ్ సింగ్ తెలిపారు. అయితే, ప్రమాదానికి గల కచ్చితమైన కారణం తెలియదన్నారు. మృతుల్లో 10 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా, 10 మందిని కాపాడినట్టు ధనబాద్ డిప్యూటీ కమిషనర్ సందీప్ కుమార్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాటకు రూ. రెండు లక్షలు గాయపడిన వారికి రూ. 50 వేలు  PMNRF కింద సాయంగా అందిస్తామని ప్రకటించింది.

ఛత్తీస్‌గఢ్ జిల్లాలో విషాదం, ఒక్కసారిగా బూడిద మట్టి పైన పడటంతో ముగ్గురు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం

జిల్లా యంత్రాంగం అత్యవసర ప్రాతిపదికన పనిచేస్తోందని, క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్టు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తెలిపారు. ధన్‌బాద్ అగ్నిప్రమాదంలో ప్రజలు మరణించడం బాధాకరమని, ఈ ఘటన తన హృదయాన్ని కలిచివేసిందని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.

Here's ANI Tweet

Here's PMO Tweet

జోరాఫాటక్‌ ప్రాంతంలోని ఆశీర్వాద్‌ టవర్‌ రెండో అంతస్తులో అంటుకున్న అగ్నికీలలు వేగంగా విస్తరించడంతో వీరంతా సజీవదహనమయ్యారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ సుఖ్‌దేవ్‌ సింగ్‌ చెప్పారు. మంటలు ఆర్పేందుకు 40 అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగాయి.