three of family consume poison in Ujjain (Photo-Video Grab)

Mumbai, Dec 23: ముంబైకి చెందిన ఓ పోర్న్‌ స్టార్‌ (Blackmailed by porn star) తమ కుటుంబాన్ని డబ్బు కోసం గత కొంతకాలంగా బ్లాక్‌మెయిల్‌ చేస్తోందని, వివాహేతర సంబంధాలున్నాయని తనను బ్లాక్ మెయిల్ చేసి తన కుటుంబానికి నరకం చూపిస్తోందని అషి ఖాన్‌ అనే వ్యక్తి వీడియో తీసి ఆత్మహత్యా ప్రయత్నం (three of family consume poison in Ujjai) చేశాడు.తల్లీ, భార్యతో కలిసి విషం తాగి వీడియో తీసి ఆత్మహత్యకు యత్నించారు.బాధితుడు స్థానికంగా ఓ బట్టల దుకాణం నడుపుతున్నట్లు సమాచారం.

ముస్లిం మతం నుంచి హిందూ మతంలోకి, పూజారిని నాలుగు ముక్కలుగా నరికి చంపిన తోటి సాధువులు, రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌ జిల్లాలో దారుణ ఘటన

ఇక నిందితురాలు రిమ్‌జిమ్‌ స్వస్థలం అసోం గువాహతి. ముంబైలో ఎయిర్‌హోస్టెస్‌గా పని చేస్తోంది. అయితే.. తరచూ నీలి చిత్రాలు, అడల్ట్‌ యాప్‌ సినిమాల్లో నటిస్తూ.. వివాహితులను లక్ష్యంగా చేసుకుని ఆమె డబ్బులు బ్లాక్ మెయిల్ చేస్తోందని తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం బంధువులు అప్రమత్తం అయ్యి స్థానికుల సాయంతో ఆ కుటుంబాన్ని ఆస్పత్రిలో చేర్పించారు.

వీడియోలో ఏముందంటే..

నా పేరు అషి ఖాన్‌, ఉజ్జయినిలోని లోహె పుల్‌లో కుటుంబంతొ కలిసి నివాసం ఉంటున్నాం. ముంబైకి చెందిన రిమ్‌జిమ్‌ అనే పోర్న్‌స్టార్‌ గత కొంతకాలంగా నాపై వేధింపులకు పాల్పడుతోంది. ముంబైలో ఉన్నప్పుడు ఆమెతో నాకు పరిచయం అయ్యింది. కొద్ది కాలం కలిసి తిరిగాం. అయితే కొంతకాలానికి ఆమె నాకు షాక్‌ ఇచ్చింది. నన్ను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే నీ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిపిస్తోంది.

Here's Video

ఏం చేయాలో తెలియక ఆమె బ్లాక్ మెయిలింగ్ కు భయపడి నా పెళ్లి టైంలో కొంత డబ్బు ఇచ్చాను. అయినా నాపై వేధింపులు ఆపలేదు. మళ్లీ ఇప్పుడు ఇంకా డబ్బు కావాలని బ్లాక్‌ మెయిల్‌ చేస్తోంది. ముంబైలో ఉన్నప్పుడు నాపై రేప్‌ కేసు పెట్టి జైలుకు పంపింది. ఇప్పుడు.. మళ్లీ ఇంకో కేసు పెట్టి జైలుకు పంపుతామని బెదిరిస్తోంది. ఆమె వేధింపులను భరించలేకపోతున్నాం. అందుకే కుటుంబంతో ఆత్మహత్యకు యత్నిస్తున్నాం అని అషి ఖాన్‌ అందులో పేర్కొన్నాడు.