Mumbai, Dec 28: ముంబైలో విచిత్రకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. నా భర్తకు ఇతర పురుషులతో సంబంధం ఉన్నందున తనతో కాపురం చేయడంలేదని ఓ భార్య కోర్టు మెట్లు ఎక్కింది. ఈ నేపథ్యంలో భార్యకు మధ్యంతర భరణం చెల్లించాలని ( gay Husband to pay wife ) స్వలింగ సంపర్కుడిని సెషన్స్ కోర్టు ఆదేశించింది. గృహహింస కేవలం శారీరకంగానే కాకుండా లైంగిక, మౌఖిక, భావోద్వేగ, ఆర్థికపరమైన వేధింపులను (Domestic violence not just physical) కూడా కలిగి ఉంటుందని కోర్టు పేర్కొంది.
ఆ మహిళ తన ఫోన్ గ్యాలరీలో దొరికిన భర్త నగ్న చిత్రాలను కోర్టు ముందుంచింది. అందులోని విషయాలు సహజంగానే మహిళకు గాయం, బాధ, మానసిక వేధింపులను కలిగించాయని అర్థం చేసుకోవచ్చని కోర్టు పేర్కొంది. ఈ ఫొటోలను భర్త సవాల్ చేయలేదని కూడా కోర్టు పేర్కొంది. గృహ హింస గణనీయంగా రుజువైనందున, తన భార్యను కాపాడుకోవాల్సిన బాధ్యత పురుషునిపై ఉందని గే భర్త తరపు లాయర్ కోర్టులో వాదించారు.అయితే అదనపు సెషన్స్ జడ్జి డాక్టర్ ఎఎ జోగ్లేకర్ ఆ అప్పీల్‌ను తోసిపుచ్చారు. దిగువ కోర్టు ఆదేశాలను సమర్థిస్తూ తీర్పును ఇచ్చింది.
ఆమెకు మధ్యంతర భరణంగా రూ.15,000 చెల్లించాలని భర్తను ఆదేశించిన మేజిస్ట్రేట్ ఉత్తర్వులను కూడా ముంబై కోర్టు ధృవీకరించింది. ఈ జంట డిసెంబర్ 2016లో వివాహం చేసుకున్నారు. పెళ్లి జరిగి రెండు వారాలు అయినా భర్త తన వద్దకు రాలేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.అదేమని అడిగితే భర్త ఏమీ మాట్లాడలేదు. పనిభారం కారణంగా అతడు ఆలస్యంగా ఇంటికి రావడం ప్రారంభించాడని ఆమె తెలిపారు.
అతను నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్‌లను ఉపయోగిస్తున్నాడని మరియు ఇతర పురుషులతో సెక్స్ చాట్‌లలో మునిగిపోతున్నాడని ఆమె గ్రహించింది.అతనితో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశానని, కానీ అవి ఫలించలేదని ఆ మహిళ చెప్పింది. పెళ్లయి ఆరు నెలలు గడిచినా ఫలితం లేకపోవడంతో వారి బంధం బెడిసికొట్టడంతో వివాహిత తన పుట్టింటికి వెళ్లాల్సి వచ్చిందని ఆమె తెలిపింది.
పరిస్థితి గురించి తన అత్తగారితో కూడా మాట్లాడానని, అయితే ఆమె సహాయం చేయలేదని మహిళ తెలిపింది.మార్చి 2017లో, అతను నిద్రపోతున్నప్పుడు అతని ఫోన్‌కి యాక్సెస్ వచ్చినప్పుడు, అతను ఇతర పురుషులతో సెక్స్ చేస్తున్నాడని గుర్తించి షాక్ అయ్యానని మహిళ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తన భర్త. అత్తమామల నుండి మానసిక వేధింపులను ఆమె ఎదుర్కొందని కోర్టు పేర్కొంది.