
Kolkata, July 5: దేశంలో స్వలింగ సంపర్కులు పెళ్లిళ్లతో ఒక్కటవుతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు చెందిన ఇద్దరు పురుషులు అందరి సమక్షంలో ఘనంగా పెళ్లి (Gay Couple Gets Married) చేసుకున్నారు. తమ మధ్య ఉన్న అసహజ సంబంధాన్ని వీరు పెళ్లి పేరుతో శ్వాశతం చేసుకున్నారు. కోల్‌కతా, గురుగ్రాంకు చెందిన ఈ ఇద్దరు స్వలింగ సంపర్కలు సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ (pictures and videos from wedding) అవుతున్నాయి.
గే జంట (Gay couple from Kolkata) అయిన అభిషేక్ రే, చైతన్య శర్మ కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో ఈ పెళ్లి తంతును సంప్రదాయంగా నిర్వహించారు. అభిషేక్ ధోతీ, కుర్తాలో సాంప్రదాయ బెంగాలీ వరుడిలా ముస్తాబుకాగా, చైతన్య శర్మ షేర్వాణీ ధరించాడు. మంగళ స్నానాలు (హల్దీ)తో పాటు పెళ్లి తంతును స్వలింగ జంట ఆనందంతో జరుపుకుంది. ఒకరి మెడలో మరొకరు పూల దండలు వేసుకున్నారు.
అరుదైన ఈ వింత వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీంతో ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా అభిషేక్ రే ఫ్యాషన్ డిజైనర్, చైతన్య శర్మ గురుగ్రామ్‌లో డిజిటల్ మార్కెటర్‌గా పనిచేస్తున్నాడు.
Here's Video
View this post on Instagram
కాగా, గతేడాది డిసెంబర్‌లో హైదరాబాద్‌లో కూడా ఒక గే జంట పెళ్లి బంధంతో ఒక్కటైంది. హైదరాబాద్ శివార్లలోని రిసార్ట్‌లో సుప్రియో చక్రవర్తి, అభయ్ డాంగ్ ఉంగరాలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన సోఫియా డేవిడ్ అనే ట్రాన్స్‌జంటర్ ఈ వేడుకను నిర్వహించింది.