Student Gives Birth in Toilet: గర్భవతి అని తెలియదట.., కడుపు నొప్పి అంటూ బాత్రూంకి వెళ్లి బిడ్డను ప్రసవించిన విద్యార్థిని, యూకేలో షాకింగ్ ఘటన
Representational image | (Photo Credits: Pixabay)

యూకేలో విచిత్రకర ఘటన జరిగింది. ఓ యువతి తను ప్రెగ్నెంట్ అని తెలియకుండానే 20 ఏళ్ల విద్యార్థిని బిడ్డకు (Student Gives Birth in Toilet) జన్మనిచ్చింది. బ్రిటన్లో యూనివర్సిటీలో చదువుతున్నఓ విద్యార్థిని (British Student In UK) రాత్రి కడుపునొప్పితో బాధపడుతూ.. బాత్రూంకు వెళితే, తెలియకుండానే బిడ్డకు జన్మనిచ్చింది. 20 ఏళ్ల జెస్ డేవిస్ అనే విద్యార్థిని సౌతాంప్టన్ యూనివర్సిటీలో పొలిటికల్ స్టడీస్ విద్యను అభ్యసిస్తోంది. అయితే తనకు పీరియడ్స్ సక్రమంగా రాకపోవడంతో దానికి సంబంధించిన నొప్పే అనుకుని బాత్రూంకు వెళ్లింది. ఆ సమయంలోనే బిడ్డకు జన్మనిచ్చింది.

అయితే ఆమె ప్రెగ్నెంట్ అయినట్లు ఎలాంటి లక్షణాలు కనిపించ లేదని..బేబీ బంప్ కూడా రాలేదని ఆమె వెల్లడించింది. తనకు పిరియడ్స్ రెగ్యులర్ గానే ఉండేవని.. అయితే కొంత కాలంగా పీరియడ్స్ రాకపోవడాన్ని పెద్దగా గమనించలేదని జెస్ డేవిస్ చెప్పారు. ఇప్పుడిప్పుడే డేవిస్ మాతృత్వానికి అలవాటుపడుతోంది. తను పుట్టినప్పుడు షాక్ కు గురయ్యానని, అంతా కల అని అనుకున్నానని.. అయితే పిల్లాడి ఏడుపు విని షాక్ కు గురయ్యానని అంది. ప్రస్తుతం పిల్లాడు దాదాపు 3 కిలోల బరువు ఉన్నాడు.

పోలీస్ స్టేషన్లో రాజభోగం అనుభవిస్తున్న పిల్లి, రాచమర్యాదలు చేస్తున్న కర్ణాటక పోలీసులు, ఎందుకో తెలుసా..

ముందుగా తీవ్రమైన నొప్పి వచ్చినప్పుడు తనకు పీరియడ్స్ ప్రారంభం అయ్యాయని భావించానని.. ఆ సమయంలో బాత్రూంకు వెళ్లాలని అనిపించిందని జెస్ డేవిస్ చెప్పుకొచ్చారు. అయితే ఇంట్లో ఒంటరిగా ఉన్న జెస్, తన బెస్ట్ ఫ్రెండ్ లివ్ కింగ్ కు ఫోన్ చేసి విషయాన్ని చెబితే ముందుగా నమ్మలేదని..అప్పుడే పుట్టిన కొడుకు ఫోటోను పంపిన తర్వాత నమ్మిందని జెస్ చెప్పారు. 35 వారాల వ్యవధిలో శిశువు జన్మించాడని.. ప్రస్తుతం తల్లి బిడ్డ కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట (Social media) వైరల్ గా మారింది