Karnataka: పోలీస్ స్టేషన్లో రాజభోగం అనుభవిస్తున్న పిల్లి, రాచమర్యాదలు చేస్తున్న కర్ణాటక పోలీసులు, ఎందుకో తెలుసా..
Cat (Photo Credits: Pixabay/Representational Image)

పోలీసులను చూస్తే నేరగాళ్లకు హడల్‌. కానీ ఎలుకలకు కాదు. అందుకే తోక జాడించుకుంటే పోలీస్ స్టేషన్ లో తెగ తిరిగేస్తున్నాయి. దీంతో పోలీసులకు స్టేషన్ లో ఎలుకలు చుక్కలు చూపిస్తున్నాయి. స్టేషన్ లో ఎలుకల బాధ తగ్గించుకోవటానికి ఓ పిల్లిని తెచ్చి పెట్టారు. దీంతో పోలీసులకు ఎలుకల బాధ తప్పిందట. దీంతో దొంగలు..నేరగాళ్లను పట్టుకోవటంలో బిజి బిజీ అయిపోయారు. రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతున్న ఉడుత వీడియో, దాహంతో అల్లాడుతున్న ఉడుత‌కు నీళ్లు అందించిన మహిళ, త‌న‌ ముంద‌టి కాళ్ల‌తో వాట‌ర్‌బాటిల్ ప‌ట్టుకుని నీళ్లు తాగిన ఉడుత

కర్ణాటకలోని మైసూర్ నగరంలోని రూరల్‌ పోలీసు స్టేషను మాదనహళ్ళి చెరువులో ఉంది. అది నిర్మానుష్య ప్రాంతం.దీంతో ఎలుకలు, పందికొక్కుల బెడద ఎక్కువగా వుంది. స్టేషనులో రికార్డులను అవి పాడు చేయడంతో విసుగు చెందిన పోలీసులు పిల్లిని ( Karnataka Cops engage cats) తెచ్చి పెట్టారు. స్టేషనుకు పిల్లి వచ్చిన తరువాత ఎలుకల బాధ కొంతవరకు తక్కువగా ఉందని పోలీసులు చెప్పారు. ఏమైతేనేమి పిల్లికి స్టేషనులో రాచమర్యాదలు దక్కుతున్నాయి.