New Delhi, July 29: దేశంలో ఆడపిల్లలపై జరుగుతున్న లైంగిక నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు తద్వారా వారికి రక్షణ కల్పించేలా 2012 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పోక్సో చట్టాన్ని(POCSO ACT) అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పోక్సో చట్టం (POCSO ACT) కింద 2020 సంవత్సరంలో ఎన్ని కేసులు నమోదయ్యాయనే విషయాన్ని కేంద్రం శుక్రవారం లోక్ సభలో(Loksabha) తెలిపింది. ఈ చట్టం కింద 2020 సంవత్సరంలో 47,221 కేసులు నమోదయ్యాయి. అంటే 39.6% నేరారోపణ రేటుగా ప్రభుత్వం పేర్కొంది. ఈ చట్టం కింద పెండింగ్‌లో ఉన్న కేసులపై (pending trial) సీపీఐ ఎంపీ ఎస్.వెంకటేశన్ (venkateshan)అడిగిన ప్రశ్నకు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ(Smriti irani) నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ద్వారా రాష్ట్రాల వారీగా డేటాను అందించారు. ఈ డేటా ప్రకారం.. 2020 సంవత్సరంలో 6,898 నమోదైన కేసులతో ఉత్తరప్రదేశ్ (Uttarapradesh) అగ్రస్థానంలో ఉండగా, మహారాష్ట్ర (5,687), మధ్యప్రదేశ్ (5,648) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. డేటా ప్రకారం.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో నేరారోపణ రేటు 70.7శాతం కాగా, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో గణాంకాలు వరుసగా 30.9%, 37.2%గా ఉన్నాయి. మరోవైపు, వరుసగా మూడు సంవత్సరాలు 100% నేరారోపణ రేటు కలిగిన ఏకైక రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం మణిపూర్ కావటం గమనార్హం. 2020 చివరి నాటికి 1,70,000 కేసులు విచారణ పెండింగ్ లో ఉన్నాయని, ఇది 2018 సంవత్సరానికి 1,08,129 గాను 57.4శాతం ఎక్కువగా ఉన్నాయని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు.
2020 సంవత్సరంలో కేంద్ర పాలిక ప్రాంతాలైన లడఖ్, చండీగడ్ లలో సున్నా కేసులు నమోదయ్యాయయి. అయితే తరువాత ఒక వ్యక్తిపై కేసు చార్జిషీట్ చేయబడింది. ఏడాది చివరి నాటికి ఎనిమిది కేసులు విచారణ పెండింగ్‌లో ఉన్నాయి. ఇద్దరు వ్యక్తులు అభియోగాలు మోపారు. రాష్ట్రాలలో గోవా, హిమాచల్ ప్రదేశ్‌లలో అత్యల్ప సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.
అత్యాచారం, పోక్సో చట్టానికి సంబంధించిన కేసులను త్వరితగతిన విచారించి పరిష్కరించేందుకు 389 ప్రత్యేక పోక్సో కోర్టులతో సహా 1,023 ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను (FTSC) ఏర్పాటు చేసేందుకు న్యాయ శాఖ ఒక పథకాన్ని అమలు చేస్తోంది. చట్టం (సవరణ) చట్టం-2018 ప్రకారం.. 2022లో 892 ఎఫ్‌టిఎస్‌సిలు యాక్టివ్‌గా ఉండగా, 2021లో 898 ఉన్నాయని కేంద్ర మంత్రి ఇరానీ చెప్పారు.