
Lucknow, Jan 13: యూపీలో మతం మారేందుకు ఒప్పుకోలేదని ఒక భర్త తన భార్యపై దారుణంగా వేధింపులకు (UP woman alleges torture by husband) పాల్పడ్డాడు.మత మార్పిడికి అభ్యంతరం చెప్పడంతో భర్త తనను తరచూ కొట్టి హింసిస్తున్నాడని, సిగరెట్ పీకలతో కాల్చి (Burnt with cigarettes), బలవంతంగా మాంసం తినేలా చేశాడని (forcibly fed meat) ఓ మహిళ లక్నోలో ఆరోపించింది.లక్నో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్నో ప్రాంతానికి చెందిన చాంద్ మొహమ్మద్ అనే వ్యక్తి, తాను హిందువుగా చెప్పుకొంటూ బాధిత మహిళకు దగ్గరయ్యాడు.కొద్ది రోజులకు పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లి సమయంలో తన పేరును సాని మౌర్య అని చెప్పాడని వెల్లడించింది. వివాహం తర్వాత లక్నో నగరంలో అద్దెకు ఉంటున్నామని, కొన్నాళ్లుగా భర్త తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. అంతేకాకుండా ఇస్లాం మతాన్ని స్వీకరించాలని బలవంతం చేశాడని చెప్పింది. తాను మతం మారనని చెప్పడంతో శారీరకంగా హింసించడం మొదలు పెట్టాడని, సిగరెట్ పీకలతో కాల్చి, వేడి నూనె పోశాడని మహిళ ఆరోపించింది.
ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తానని, బంధువులతో తనపై అత్యాచారం చేయిస్తానని బెదిరించాడని ఆమె వాపోయింది. ఇంటి నుంచి పారిపోయి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ భర్త తమ గదిలోకి లాక్కెళ్లి కొట్టేవాడని బాధితురాలు ఆరోపించింది. ఐదు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు కూడా చాంద్ మహ్మద్ తనను కొట్టడంతో గర్భస్రావం జరిగిందని ఆమె పేర్కొంది. వన్–స్టాప్ సెంటర్ ద్వారా రక్షణ పొందిన సదరు మహిళ తన భర్తపై పోలీసుకు ఫిర్యాదు చేసింది.ప్రస్తుతం బాధిత మహిళ ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.