Sextortion (photo-Twitter)

Gandhi Nagar, Jan 13: గుజరాత్‌ రాష్ట్రంలోని అహమ్మదాబాద్‌లో గల వ్యాపారవేత్తని ఓ కిలాడి మహిళ సెక్స్ (Gujarat 'sextortion' case) అంటూ ఉచ్చులోకి దింపి ఏకంగా రూ.2.69 కోట్లు (loses Rs 2.69 crore) దోచుకుంది. బలవంతంగా అతని (Ahmedabad businessman) వీడియోకాల్స్‌ మాట్లాడించి ఆ తర్వాత బ్లాక్‌మెయిల్‌కి పాల్పడి, హైకోర్టు అంటూ కేసుల పేరుతో భయబ్రాంతులకు గురిచేసింది.ఆమెతో పాటు 11 మంది పలు దఫాలుగా వ్యాపార వేత్త నుంచి డబ్బులు కొల్లగట్టారు. చివరికి బాధితుడు తాను మోసపోయినట్లు గుర్తించి, సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు.

ఈ ఘటనలో 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

షాకింగ్ వివరాల్లోకెళ్తే..పునరుత్పాదక ఇంధన సంస్థను నడుపుతున్న ఒక పారిశ్రామికవేత్తకి గతేడాది ఆగస్టు8న రియా శర్మ అనే మహిళ నుంచి ఫోన్ కాల్‌ వచ్చింది. ఆ తర్వాత ఆమె తన మాయమాటలతో ఆ వ్యక్తిని బట్టలు లేకండా వీడియో కాల్‌ (nude video call trap) లోకి రమ్మంది. ఆ తర్వాత అనుహ్యంగా ఫోన్‌ కాల్‌ కట్‌ అయ్యింది. కాసేపటికి ఆ వ్యాపారవేత్తని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. మీ నగ్న వీడియో సర్యూలేట్‌ కాకుండా ఉండాలంటే రూ.50 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

వితంతువుపై తెగబడిన కామాంధులు, ఇంట్లోకి దూరి దారుణంగా అత్యాచారం, ఆపై మంచం మీదనే చంపేసి కాల్చివేసిన దుండగులు

మరికొన్ని రోజుల తర్వాత ఢిల్లీ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ గుడ్డుశర్మ అనే పేరుతో ఓ వ్యక్తి కాల్‌ చేసి ఏకంగా ఆ వీడియో క్లిప్‌ తన వద్ద ఉందని పేర్కొంటూ ఏకంగా రూ. 3 లక్షలు దోచేశాడు. సరిగ్గా ఆగస్టు14న మరో కాల్‌లో.. మీరు వీడియోకాల్‌ మాట్లాడిన మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని, ఆమె తల్లి మీపై కేసు పెట్టిందుకు సీబీఐని అశ్రయించందంటూ బాంబుపేల్చారు. ఈసారి వారు ఏకంగా రూ. 80 లక్షలు డిమాండ్‌ చేశారు.

12 ఏళ్లకే గుండెపోటు, నిద్రలోనే ఉలిక్కిపడిలేచి విలవిలలాడిన చిన్నారి, ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే కన్నుమూత

ఆ దుండగలు ఫేక్‌ ఢిల్లీ హైకోర్టు పేరుతో డిసెంబర్‌ 15 వరకు బాధితుడు నుంచి డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారు. చివరి కేసు క్లోజ్‌ అయ్యిందంటూ ఒక ఉత్తర్వు చేతిలో పెట్టారు. అప్పుడు ఆ ఉత్తర్వు చూడగానే అనుమానం తలెత్తి సైబర్‌ క్రైంని ఆశ్రయించినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు బాధితుడు జనవరి 10న సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి, దాదాపు 11 మందిపై కేసు పెట్టాడు. అంతేగాదు తన నుంచి సుమారు రూ. 2.69 కోట్లు దోపిడీ చేసినట్లు ఫిర్యాదు చేశాడని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు.