Lucknow, June 21: ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌బాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అబ్బాయిలా మారుస్తానని చెప్పి.. యువతిని ఓ తాంత్రికుడు దారుణంగా నరికి (woman killed by tantrik) చంపాడు. తన లెస్బియన్ ప్రేమికుడిని వివాహం చేసుకోవడానికి తన లింగాన్ని మారుస్తానని హామీ (promising to change her gender) ఇచ్చినందుకు ఒక మహిళను హత్య చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
షాజహాన్‌బాద్ జిల్లాలోని ఆర్‌సీ మిషన్ పోలీసు స్టేషన్ పరిధిలోని పూనమ్, ప్రీతితో స్నేహం చేసింది. తర్వాత ఇద్దరూ స్వలింగ సంపర్కంలోకి ప్రవేశించారు.పూనమ్‌తో ప్రేమ వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రీతీ పెళ్లి చేసుకోలేకపోయిందని పోలీసులు తెలిపారు. ఈ విషయం ఇరు కుటుంబ సభ్యులకు తెలియదు. ప్రీతికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. కానీ పూనమ్‌తో తనకున్న సంబంధం బయటపడటంతో సంబంధాలన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి.
ఈ క్రమంలో ప్రీతి తల్లి ఊర్మిళ పూనమ్‌ను చంపేందుకు స్థానికంగా నివాసం ఉండే రామ్ నివాస్ అనే తాంత్రికుడిని సంప్రదించింది. పూనమ్‌ను చంపితే రూ. 1.5 లక్షలు ఇస్తానంటూ ఒప్పందంలో భాగంగా మొదట రూ. 5 వేలు ఇచ్చింది. పూనమ్‌ను చంపిన తర్వాత మిగిలిన మొత్తం ఇస్తానని చెప్పింది. ప్లాన్ ప్రకారం ప్రీతి.. పూనమ్‌కు ఫోన్ చేసి తాంత్రికుడు తన లింగాన్ని మారుస్తానని నమ్మబలికింది. ఏప్రిల్ 18న పూనమ్ తన ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయింది. ఆమె సోదరుడు ఏప్రిల్ 26న మిస్సింగ్ కేసు నమోదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పూనమ్.. ప్రీతి, రామ్‌నివాస్‌తో మాట్లాడినట్లు నిఘా ద్వారా తేలిందని పోలీసులు తెలిపారు. సమాచారం మేరకు పోలీసులు రాంనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నేరం ఒప్పుకున్నాడు. పూనమ్‌ను మనిషిగా మారుస్తాననే సాకుతో ఆమెను అడవికి తీసుకెళ్లి నది ఒడ్డున కళ్లు మూసుకుని పడుకోమన్నాడని పోలీసులకు తెలిపాడు. ఇంతలో కొడవలితో బాధితురాలి మెడ కోశాడు.అనంతరం డెడ్‌బాడీని చెట్ల పొదల్లో వేసి పారిపోయాడు. మొత్తంగా ఈ కేసులో ప్రీతి, రామ్ నివాస్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఊర్మిళ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.తాంత్రికుడి ఇంటి నుంచి హత్యకు ఉపయోగించిన సుత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.