హైదరాబాద్ నగరంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వివిద ప్రాంతాల్లో రెండు జంట హత్యలు కలకలం రేపాయి. టపాచబుత్ర పీఎస్ పరిధిలో ఇద్దరు హిజ్రాలను దుండగులు దారుణంగా (Transgenders Murdered in Hyd) హతమార్చగా..రాజేంద్రనగర్ ప్రాంతంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరిని బండరాళ్లతో మోది హత్య చేశారు.
తొలి ఘటన వివరాల్లకెళితే..టప్పచబుత్ర పరిధిలోని దైబాగ్ ప్రాంతంలో యూసుఫ్ అలియాస్ డాలి(25), రియాజ్ అలియాస్ సోఫియా ( 30) అనే ఇద్దరు హిజ్రాలు నివాసం ఉంటున్నారు. మంగళవారం అర్థరాత్రి సమయంలో కొంతమంది దుండగులు కత్తులు, బండరాళ్లతో కొట్టి వారిద్దరిని కిరాతకంగా (Two Transgenders murdered With Stones) చంపేశారు.
ఈ హత్యతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దీనిపై స్థానికులు సమాచారం అందించడంతో.. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.హత్య జరిగిన ప్రాంతాన్ని దక్షిణ మండల డీసీపీ కిరణ్ పరిశీలించారు.
టపాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జంట హత్యలు జరిగినట్లు మాకు సమాచారం అందింది. వెంటనే మేం ఇక్కడికి వచ్చాం. మృతులు ఇద్దరు ట్రాన్స్జెండర్లు.. వారి వయస్సు 25 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉంటుంది. వారు ఈ ప్రాంతానికి చెందినవారే. అక్రమ సాన్నిహిత్యం కారణంగా హత్య జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నాం. దాని ప్రకారమే అనుమానితుల్ని అదుపులోకి తీసుకుంటున్నాం. రెండు రోజుల్లో నిందితుల్ని పట్టుకుంటాం. బాధితుల్ని బండరాయితో, కత్తులతో పొడిచి చంపారు. కత్తిని స్వాధీనం చేసుకున్నాం. క్లూస్ టీమ్ కూడా వచ్చింది’’ అని సౌత్ జోన్ డీసీపీ కిరణ్ తెలిపారు.
మరోవైపు రాజేంద్రనగర్ ప్రాంతంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరిని బండరాళ్లతో మోది హత్య చేశారు. ఇద్దరూ నిద్రిస్తున్న సమయంలో వచ్చిన ఇద్దర వ్యక్తులు వారిని అత్యంత దారుణంగా బండ రాళ్లతో చంపారు. ఎందుకు చంపారనేదానిపై ఇంకా సమాచారం లేదు.