New Delhi, November 12: భారతదేశంలో కొవిడ్ తీవ్రత తగ్గుముఖం పడుతోంది. అయినప్పటికీ వైరస్ వ్యాప్తి ఇప్పటికీ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. అయితే రికవరీ రేటు మనదేశంలో మెరుగ్గా ఉండటం ఊరటనిచ్చే అంశం. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 47,905 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య గురువారం ఉదయం నాటికి 86,83,917కు చేరింది. నిన్న ఒక్కరోజే 550 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,28,121కు పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 52,718 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 80,66,502 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్కరోజులోనే ఆక్టివ్ కేసుల సంఖ్య 5,363 తగ్గింది. దీంతో ప్రస్తుతం దేశంలో 4,89,294 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
India's COVID19 Update:
With 47,905 new #COVID19 infections, India's total cases surge to 86,83,917. With 550 new deaths, toll mounts to 1,28,121
Total active cases are 4,89,294 after a decrease of 5,363 in the last 24 hrs.
Total cured cases are 80,66,502 with 52,718 new discharges in the last 24 hrs. pic.twitter.com/sHwZwqQcRU
— ANI (@ANI) November 12, 2020
ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 92.89% ఉండగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 5.63% శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు కేవలం 1.48% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
ఇక నవంబర్ 11 వరకు దేశవ్యాప్తంగా 12,19,62,509 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 11,93,358 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.
ఇక కరోనావైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న రాష్ట్రాలలో దేశంలోనే మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతుంంది. ఈ రాష్ట్రంలో ఆక్టివ్ కేసులు 89,018కు చేరగా, కొవిడ్ మరణాలు 45,560కు పెరిగాయి. దీని తర్వాత కేరళలో ప్రస్తుతం 78,538 ఆక్టివ్ కేసులుండగా, మరణాల సంఖ్య మాత్రం మిగతా రాష్ట్రాలతో పోల్చితే కాస్త తక్కువగానే 1771గా ఉన్నాయి. ఇక మూడో స్థానంలో దిల్లీ రాష్ట్రం ఉంది, ఇక్కడ ఆక్టివ్ కేసులు 42,629గా ఉండగా, కరోనా మరణాల సంఖ్య 7228కు పెరిగింది.