Telugu student Thummeti Saikumar Reddy Dies by Suicide in the United States (Photo-X/pixabay/rep)

అమెరికాలోని న్యూయార్క్‌లో చదువుతున్న తుమ్మేటి సాయికుమార్‌రెడ్డి తన రూమ్‌లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తున్న సాయికుమార్‌రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే సాయి కుమార్రెడ్డి ఫ్యామిలీకి సూసైడ్ సమాచారం ఇంకా అందలేదు. సాయికుమార్ ఫోన్లాక్ చేసి ఉందని స్నేహితులు తెలిపారు.. తల్లిదండ్రులకు ఎలా సమాచారం ఇవ్వాలో తెలియక ఆందోళనపడుతున్నారు. చదవుకుంటూనే పార్ట్టైమ్ ఉద్యోగం చేస్తున్న సాయికుమార్.. ఉద్యోగం చేస్తున్న ఆఫీసులోనే సాయికుమార్రెడ్డి పాస్ట్ పోర్ట్ ఉంది.

వీడియో ఇదిగో, భర్త చనిపోయాడని కల్లుకు బానిసైన భార్య, ఓవర్ హెడ్ ట్యాంక్ పైనుండి దూకి ఆత్మహత్యయత్నం, కాపాడిన స్థానికులు

కొద్ది రోజుల క్రితం హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం మాదన్నపేటకు చెందిన విద్యార్థి బండి వంశీ(25) అనుమానాస్పద రీతిలో మరణించారు. కాంకోర్డియా సెయింట్‌ పాల్‌ విశ్వవిద్యాలయం చదువుతూ.. 8580 మాగ్నోలియా ట్రైల్‌ ఈడెన్‌ ప్రెయిరీ అపార్ట్‌మెంట్‌లో పార్క్‌ చేసిన కారులో అనుమానాస్పద స్థితితో మృతి చెందాడు. తాజాగా, సాయికుమార్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో అతని స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Telugu student Thummeti Saikumar Reddy Dies by Suicide in  United States

డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేసే వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పార్ట్‌టైమ్‌ జాబ్స్‌ లేక.. ఎడ్యుకేషన్‌ లోన్‌ చెల్లించాల్సి రావడంతో విద్యార్థులు ఒత్తిడి గురవుతున్నారు. ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.