Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. బుధుడు రాశిలోనూ నక్షత్రాలను ద్వారా తమ గమనాన్ని వేగంగా మార్చుకుంటాడు. అయితే ఒకే నెలలో అంటే ఫిబ్రవరిలో బుధుడు అయిదు సార్లు తన నక్షత్రాన్ని మార్చుకుంటూ ఉంటాడు. ఫిబ్రవరి ఏడవ తేదీన 11వ తేదీన అదేవిధంగా ఫిబ్రవరి 12 15 22వ తేదీ ,27వ తేదీ ఈ విధంగా ఐదు సార్లు బుధుడు తన నక్షత్రాన్ని మార్చుకుంటూ ఉంటాడు. దీని కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

తులారాశి- తులారాశి వారికి బుధుడు తన నక్షత్రం మార్పు కారణంగా కెరియర్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త కొత్త ప్రాజెక్టు పనులను పొందుతారు. వ్యాపారవేత్తలకు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త కస్టమర్లు వస్తారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి విజయాన్ని సాధిస్తారు. బుధ గ్రహం తెలివితేటలను ఆనందాలను ఇచ్చే గ్రహంగా ఉంటుంది.

Vastu Tips: శని మిమ్మల్ని పట్టి పీడిస్తోందని భావిస్తున్నారా, 

సింహరాశి- సింహ రాశి వారికి బుద్ధుడి నక్షత్రం మార్పు అనేక శుభ ఫలితాలను అందిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడుపుతారు. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. జీతాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు కోరుకున్నచోట సీటు లభిస్తుంది.

మిథున రాశి- మిథున రాశి వారికి బుధ గ్రహ నక్షత్ర మార్పు అనేక శుభ ఫలితాలను అందిస్తుంది. వీరికి అదృష్టం కలిసి వస్తుంది. వీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా విజయాలను అందిస్తాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త అందుతుంది. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు కోర్టు సమస్యలు తొలగిపోతాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.