Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలు రాశి మార్పు కారణంగా అనేక శుభ ఫలితాలు ఉంటాయి. వారికి అదృష్టం పూర్తిగా అనుకూలంగా మారుతుంది. విజయవకాశాలు కొత్త కొత్త పొందుతారు. మరికొందరు కెరీర్ పైన పురోగతిని పొందుతారు. ఫిబ్రవరి 9న కుజ గ్రహం సింహరాశిలోకి ప్రవేశించడం ద్వారా అన్ని రాశుల వారికి మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
వృషభ రాశి- వృషభ రాశి వారికి కుజ గ్రహం రాశి మార్పు కారణం అనేక శుభ ఫలితాలను అందిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఏదైనా కొత్త పనిని ప్రారంభంచాలనుకున్నప్పుడు ఈరోజున చాలా బాగుంటుంది. మీ కృషికి తగ్గ ఫలితాలు లభిస్తాయి. దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు.
Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి,
ధనస్సు రాశి- ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి 9 నుంచి మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి. ఇది వీరికి చాలా మంచి ఫలితాలను అందిస్తాయి. ఉద్యోగంలో వ్యాపారంలో పురోగతి ఉంటుంది. పాత పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. కుటుంబంతో సమయాన్ని గడపడానికి అవకాశం లభిస్తుంది. ఇంట్లో ఆనందం ఉంటుంది. డబ్బుకు సంబంధించిన విషయాలను పట్ల ఎటువంటి ఆందోళన లేదు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కోర్టు సమస్యలు తొలగిపోతాయి.
మేషరాశి- మేష రాశి వారికి అనేక శుభ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. పాత స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతారు. మీలో విశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కోర్టు సమస్యల నుంచి బయటపడతారు. ఎప్పటినుంచో కొనుగోలు చేయాలనుకుంటున్న సొంత ఇంటికాడ నెరవేరుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.