New Delhi, AUG 31: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం జొమాటో (Zomato) సరికొత్త సేవలను తమ కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం మనం ఉంటున్న నగరంలోని పలు ప్రాంతాల్లో మనం కోరిన ఫుడ్ (Food), ఆహార పదార్థాలను డెలివరీ (Delivery)చేస్తున్న సంస్థ.. త్వరలో ఇతర నగరాల్లోని ప్రసిద్ధి చెందిన ఆహార పదార్థాలనుసైతం వేగంగా మీ ఇంటికి చేర్చేలా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే కొన్ని నగరాల్లో ‘ఇంటర్‌సిటీ లెజెండ్స్’ (intercity legends) పేరుతో ఈ సేవలను జొమాటో అందుబాటులోకి తెచ్చింది. దేశంలోని అనేక నగరాల్లో ఆయా ప్రాంతాల్లోని ఆహార పదార్థాలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఆ పదార్థాలను ఒక్కసారైనా రుచి చూడాలని చాలా మందికి కోరిక ఉంటుంది. అయితే వాటిని తెప్పించుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్నపనే, ఆ ప్రసిద్ధి చెందిన ఆహార పదార్థాలను తినాలంటే మనం ఆ ప్రాంతాలకు వెళ్లినప్పుడే సాధ్యమవుతుంది.
ఉదాహరణకు.. హైదరాబాద్ బిరియానీ (Hyderabadi biryani), కోల్‌కతా రసగుల్లా (rosogollas from Kolkata), బెంగళూరు మైసూర్ పాక్ (Mysore pak from Bengaluru), లఖ్‌నపూ కబాబ్ (kebabs from Lucknow), పాత ఢిల్లీ బటర్ చికెన్, జయపురం ప్యాజ్ కచోరీ.. ఇలా అనేక నగరాల్లో ప్రతిసిద్ధిగాంచిన ఆహార పదార్థాలు ఎన్నో ఉంటాయి. వాటిని మనం రుచిచూడాలంటే కొంచెం కష్టమైన పనే. అయితే ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ దేశంలోని ప్రసిద్ధిగాంచిన వంటకాలను, ఆహార పదార్థాలను రుచిచూడాలంటే ఇప్పుడు జొమాటో ఆర్డర్ చేయొచ్చు. కానీ .. ఆ పదార్థాలు మీకు వెంటనే రావాలంటే సాధ్యంకాదు. ఒక్కరోజులో సాధ్యమైనంత వేగంగా వాటిని మీ ఇంటికి చేర్చేందుకు జొమాటో ‘ఇంటర్‌సిటీ లెజెండ్స్’ సేవలు అందుబాటులోకి తేనుంది.
తొలుత ఈ ‘ఇంటర్‌సిటీ లెజెండ్స్’ సేవలను గురుగ్రావ్, దక్షిణ ఢిల్లీలోని ఎంపిక చేసిన వినియోగదార్లకు అందుబాటులోకి తేనున్నట్లు జొమాటో సీఈవో దీపిందర్ గోయెల్ తెలిపారు. కొద్దికాలంలో ఈ సేవలను ఇతర నగరాలకుpilot project విస్తరించనున్నట్లు వెల్లడించారు. ఆర్డర్ చేసిన మరుసటి రోజే ఆహార పదార్థాలను వినియోగదారుడికి చేరవేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు సీఈవో దీపిందర్ పేర్కొన్నారు. ఈ ఆహార పదార్థాల రంగు, రుచి, వాసన, నాణ్యత విషయంలో రాజీపడకుండా, ల్యాబ్ పరీక్షల తర్వాతే అందిస్తారట.
రెస్టారెంట్లతో తాజా ఆహార పదార్థాలను తయారు చేయించి, పునర్వినియోగించే, ట్యాంపర్ ఫ్రూప్ కంటెయినర్లలో ప్యాకింగ్ చేయించి విమానాల్లో సురక్షితంగా రవాణా అయ్యేలా చూస్తామని జొమాటో సీఈవో వెల్లడించారు. అయితే ఈ సేవలు అందుబాటులోకి రావాలంటే కొద్దికాలం ఆగాల్సిందే.