రాజకీయాలు
Punjab Assembly Election Results 2022: పంజాబ్ కింగ్ ఎవరు, కేజ్రీవాల్ అధికారాన్ని కైవసం చేసుకుంటారని చెబుతున్న సర్వేలు, ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
Hazarath Reddyపంజాబ్‌లో 117 స్థానాల్లో ఒకే విడుతలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 1304 మంది పోటీచేశారు. వీరిలో 93 మంది మహిళా అభ్యర్థులు, ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. వీరందరి భవితవ్యం నేడు తేలనుంది. కాగా పంజాబ్‌లో ఆప్‌(ఆమ్‌ ఆద్మీ పార్టీ) గెలుస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయి. మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.
Assembly Election Results 2022: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ప్రారంభమైన కౌంటింగ్, 5 రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాలకు మొదలైన ఓట్ల లెక్కింపు
Hazarath Reddyఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది.ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆయా రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సుమారు యాభై వేలమంది అధికారులు భద్రత కోసం మోహరించారు.
Cow Dung Briefcase: ఆవుపేడతో తయారు చేసిన సూట్ కేస్‌ లో బడ్జెట్, చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ వినూత్న ప్రయత్నం, ధనలక్ష్మికి ప్రతీకగా సూట్ కేస్ రూపొందించిన ఆర్టిస్టులు, దీని ప్రత్యేకత తెలుసా?
Naresh. VNSఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ (CM Baghel) రాష్ట్ర అసెంబ్లీలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను (Budget) ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో స్వయం ఉపాధి సంఘాలకు, గ్రామాభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సీఎం భూపేష్ బఘెల్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ సందర్భంగా సీఎం భూపేష్ బఘెల్ ఒక ప్రత్యేకత చాటుకున్నారు
Elections for 13 Rajya Sabha Seats: 13 రాజ్యసభ స్థానాలకు మార్చి 31న ఎన్నికలు, ఆరు రాష్ట్రాల నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2022తో ముగింపు
Hazarath Reddy13 రాజ్యసభ స్థానాలకు మార్చి 31న ఎన్నికలు (Elections for 13 Rajya Sabha Seats) నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం మార్చి 7న ప్రకటించింది. ఆరు రాష్ట్రాల నుండి ఎన్నికైన 13 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2022లో పదవీ విరమణతో ముగియనుంది" అని ఎన్నికల సంఘం (Election Commission) ఒక ప్రకటనలో తెలిపింది.
Uttar Pradesh Exit Poll Results 2022: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మళ్లీ బీజేపీ జెండా, అత్యధిక స్థానాలతో అధికారంలోకి వస్తుందని చెబుతున్న ఎగ్జిట్ పోల్స్
Hazarath Reddyఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ సోమవారం సాయంత్రంతో ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అత్యధిక ఎగ్జిట్ పోల్స్‌ వెల్లడిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని పీపుల్స్‌ పల్స్‌ సర్వే అంచనా వేసింది.
Manipur Exit Poll Results 2022: మణిపూర్‌‌లో బీజేపీ వైపే మొగ్గు చూపుతున్న ఎగ్జిట్ పోల్స్, కాంగ్రెస్ గట్టి పోటీ నిస్తుందని సర్వేల ఫలితాల్లో వెల్లడి
Hazarath Reddyఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ సోమవారం సాయంత్రంతో ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. మణిపూర్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను బట్టి అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొన్నట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌ను వెనక్కినెట్టి సీఎం బీరెన్‌సింగ్‌ నేతృత్వంలోని బీజేపీ మరోసారి అధికారాన్ని చేపట్టనున్నట్లు సర్వేల ఫలితాల్లో తేలింది.
Goa Exit Poll Results 2022: హంగ్ దిశగా గోవా, కాంగ్రెస్- బీజేపీ మధ్య ఉత్కంఠ పోరు, కింగ్ మేకర్ పైనే సర్వత్రా ఆసక్తి, మార్చి 10న ఫలితాలు
Hazarath Reddyఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ సోమవారం సాయంత్రంతో ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. గోవాలోని 40 స్థానాలకు గాను కాంగ్రెస్ 14 నుంచి 19 సీట్లు గెలుచుకుని ముందు వరుసలో నిలిచే అవకాశం ఉంది. బీజేపీ సైతం 13 నుంచి 18 సీట్లు వరకూ గెలుచుకోవచ్చు.
Uttarakhand Exit Poll Results 2022: ఉత్తరాఖండ్‌లో హోరా హోరీ, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిన ఎగ్జిట్ పోల్స్, బీజేపీ గట్టి పోటినిచ్చే అవకాశం
Hazarath Reddyజీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పాగా వేసే వీలుంది. ఉత్తరాఖండ్‌లో 70 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ 35 నుంచి 40 సీట్లు గెలుచుకుని మొదటి వరుసలో నిలిచే అవకాశం ఉంది. బీజేపీ 26 నుంచి 30 సీట్లు, బీఎస్‌పీ 2 నుంచి 3, ఇతరుల ఒకటి నుంచి మూడు సీట్లు గెలుచుకోవచ్చు.
Punjab Exit Poll Results 2022: పంజాబ్ కింగ్ కేజ్రీవాల్, బీజేపీకి భారీ షాక్.. అతి పెద్ద పార్టీగా అవతరించనున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ, వెల్లడిస్తున్న ఎగ్జిట్ పోల్స్
Hazarath Reddyపంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) అధికారంలోకి రానుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందని పీపుల్స్‌ పల్స్‌ సర్వే అంచనా వేసింది. ఆమ్‌ ఆద్మీ పార్టీకి 59 నుంచి 66 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
Russia-Ukraine Conflict: ఉక్రెయిన్ అధ్యక్షుడుతో పీఎం మోదీ ఫోన్ కాల్, భార‌త పౌరుల త‌ర‌లింపులో సాయం ప‌ట్ల జెలెన్ స్కీకి పీఎం కృత‌జ్ఞ‌త‌లు, దౌత్య మార్గాల్లో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవాలని సూచన
Hazarath Reddyఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీతో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోనులో మాట్లాడారు. వీరిద్ద‌రి మ‌ధ్య దాదాపు 35 నిమిషాల పాటు సంభాష‌ణ కొన‌సాగింది. ఉక్రెయిన్ నుంచి భార‌త పౌరుల త‌ర‌లింపులో సాయం ప‌ట్ల జెలెన్ స్కీకి మోదీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
Uttar Pradesh Assembly Elections 2022: కొనసాగుతున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల చివరి విడత పోలింగ్, 9 జిల్లాల్లోని 54 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్, మార్చి 10న ఫలితాలు
Hazarath Reddyఉత్తర ప్రదేశ్‌ ఏడో దశ పోలింగ్‌ కొనసాగుతోంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల చివరి విడత పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. 9 జిల్లాల్లోని 54 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ సాగుతోంది. చందౌలీ, ఘాజీపూర్, మౌ, అజంగఢ్, మీర్జాపూర్, భదోహి, జౌన్‌పూర్, సోన్‌భద్ర, వారణాసి జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.
Chennai’s First ever Dalit Woman Mayor: చెన్నై నగరానికి తొలి దళిత మహిళా మేయర్, అతి చిన్న వయసులో మేయర్ పదవి దక్కించుకున్న ఆర్. ప్రియ, మహిళల సమస్యలు తీర్చడమే తన ప్రథమ లక్ష్యమంటున్న చెన్నై కొత్త మేయర్
Naresh. VNSఆర్‌.ప్రియ చెన్నై(Chennai) నగరానికి 49వ మేయర్‌. అంటే ఆమెకు ముందు 48 మంది మేయర్లు ఆ నగరానికి పని చేస్తే వారిలో ఇద్దరే మహిళా మేయర్లు. 1957లో కాంగ్రెస్‌ నుంచి తారా చెరియన్, 1971లో డి.ఎం.కె నుంచి కామాక్షి జయరామన్‌లు మాత్రమే మేయర్లుగా పని చేశారు. మిగిలిన వారంతా పురుషులే. ఇక దళిత మహిళ ఈ స్థానంలో కూచోవడం అనేది చరిత్రలోనే లేదు.
Peshawar Bomb Blast: పాకిస్థాన్‌లో బాంబు పేలుడు, 30 మంది మృతి, మరో 50 మందికి గాయాలు, సూసైడ్ అటాక్ జ‌రిగిన‌ట్లు అనుమానాలు
Hazarath Reddyపాకిస్థాన్‌లో పెషావ‌ర్‌లోని ఓ మ‌సీదులో జ‌రిగిన పేలుడులో 30 మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. సూసైడ్ అటాక్ జ‌రిగిన‌ట్లు అనుమానిస్తున్నారు. లేడీ రీడింగ్ హాస్పిట‌ల్‌కు చెందిన అధికారులు మృత‌దేహాల‌ను గుర్తిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో 50 మంది గాయ‌ప‌డిన‌ట్లు తెల‌తుస్తోంది.
Three Capitals Row: అమరావతి రాజధానిగా ఆరునెలల్లో అభివృద్ధి పనులన్ని పూర్తి చేయండి, ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు, మూడు రాజధానుల అంశంపై తుది తీర్పును వెల్లడించిన ధర్మాసనం
Hazarath Reddyమూడు రాజధానుల అంశంపై (Three Capitals Row) ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని, రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని స్పష్టం చేసింది. సీఆర్‌డీఏ చట్టప్రకారం వ్యవహరించాలని ఏపీ ప్రభుత్వాన్ని (AP High Court directs state government) ఆదేశించింది.
UP Election 2022: ఉత్తరప్రదేశ్ లో కొనసాగుతున్న ఆరోదశ పోలింగ్, ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం యోగి, ఈ సారి బరిలో కీలకమైన మంత్రులు, నేతలు
Naresh. VNSఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఆరో దశ (6th Phase election) ఎన్నికలు కొనసాగుతున్నాయి.ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గం గోరఖ్‌పూర్‌తో (Gorakhpur) సహా 10 జిల్లాల్లో 57 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది. ఆరో దశ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఉదయం 7 గంటలకు ఓటింగ్‌ ప్రారంభమవ్వగా సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
Fact Check: రష్యాలో పోర్న్ హబ్ బ్లాక్, వైరల్ అవుతున్న ఈ వార్తలో ఎటువంటి నిజం లేదు, పాత పోస్టులతో ఆ న్యూస్ వైరల్ చేశారని తెలిపిన ఫుల్‌ఫాక్ట్ వెబ్‌సైట్
Hazarath Reddyరష్యాలో పోర్న్ వెబ్‌సైట్ పోర్న్‌హబ్ కూడా నిషేధించబడిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వాదనలో నిజం ఏమిటి? ఫుల్‌ఫాక్ట్ అనే వెబ్‌సైట్ దీనిపై విచారణ చేపట్టింది.
AP Assembly Budget Sessions 2022: మార్చి 7నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, టీడీపీ ఎమ్మెల్యేల హాజరుపై అయోమయం, మార్చి 11 లేదా 14 తేదీల్లో ఏపీ వార్షిక బడ్జెట్‌
Hazarath Reddyమార్చి 7నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్ర వార్షిక బ‌డ్జెట్‌ను ఈ స‌మావేశాల్లోనే (AP Assembly Budget Sessions 2022) ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. 7న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ ప్రసంగించనున్నారు. 8న గౌతమ్‌రెడ్డి మృతిపై సభ సంతాపం తెలపనుంది. 9,10 తేదీల్లో గ‌వ‌ర్న‌ర్ ప్రసంగానికి ధ‌న్య‌వాదాలు తెల‌ప‌నున్నారు. మార్చి 11న బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Sanjay Pandey New Mumbai CP: ముంబై పోలీస్ కమిషనర్‌గా సంజయ్ పాండే, ప్రస్తుత ముంబై సీపీ హేమంత్ నాగ్రాలే ను బదిలీ చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం
Hazarath Reddyముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నాగ్రాలేను మహారాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. అతని స్థానంలో ముంబై కమాండ్‌ని సంజయ్ పాండేకి బాధ్యతలు అప్పగించారు. పదునైన అధికారిగా ఐపీఎస్ సంజయ్ పాండే కు పేరుంది.
Prashant Kishor Meets CM KCR: సీఎం కేసీఆర్‌‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ, ముఖ్యమంత్రి ఫాంహౌస్‌లో కీలక చర్చలు, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ మోడల్‌ పేరిట ప్రజల్లోకి వెళ్లనున్నటీఆర్ఎస్
Hazarath Reddyతెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా, కేసీఆర్‌తో భేటీ (Prashant Kishor Meets CM KCR) కావడం రాజకీయ వర్గాల్లో చర్చను రేపుతోంది.
Manipur Assembly Elections 2022: మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికలకు కొనసాగుతున్న పోలింగ్, 38 స్థానాలకు ఓటింగ్, గత ఎన్నికల్లో 21 చోట్ల నెగ్గి అధికారాన్ని కైవసం చేసుకున్న బీజేపీ
Hazarath Reddyమణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఉదయం 7 గంటలకు 38 స్థానాలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఈ తొలి దఫాలో 15 మంది మహిళలుసహా 173 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం–1958 తొలగింపు డిమాండ్, రాష్ట్ర అభివృద్ధి, మహిళా సాధికారత, నిరుద్యోగం, అవినీతి అంశాలు ఓటింగ్‌పై సరళిపై ప్రభావం చూపనున్నాయి