రాజకీయాలు
Harish Rao Slams Congress: దేశంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఘనత కేసీఆర్‌దే, కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకుని ప్రచారం చేసుకుంటుందని హరీష్ రావు విమర్శలు
Hazarath Reddy24 గంటల పాటు కరెంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. దేశంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌ను అందించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపింది బీఆర్ఎస్ పార్టీయేనని గుర్తు చేశారు.
Bandi Sanjay on 2028 Telangana Elections: తెలంగాణలో 2028లో ఎగిరేది బీజేపీ జెండానే, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyఅతి తక్కువ కాలంలో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత నెలకొందని, రాష్ట్రంలో సీఎం హామీలకు విలువ లేకుండా పోయిందని మండిపడ్డారు. యూఎస్‌కు చెందిన ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ’ ఎన్‌ఆర్‌ఐ నేతలతో కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్చువల్ గా సమావేశమయ్యారు.
Disqualification Petition of BRS MLAs Today: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ.. పార్టీ ఇన్ పర్సన్ గా వాదనలు వినిపించనున్న కేఏ పాల్
Rudraఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరుగనున్నది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిల్ దాఖలైంది.
AP Assembly Session 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాల ముహూర్తం ఖరారు.. ఈ నెల 11 నుంచి సభ ప్రారంభం.. కనీసం పదిరోజుల పాటు సమావేశాలు
Rudraఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. నవంబరు 11 నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది.
Merugu Nagarjuna: నేను ఏ టెస్టులకైనా సిద్ధమంటూ మెరుగు నాగార్జున సవాల్, మహిళ తనపై చేసిన అత్యాచారం ఆరోపణలను ఖండించిన వైసీపీ నేత, వీడియో ఇదిగో..
Hazarath Reddyవైసిపి మాజీమంత్రి మేరుగ నాగార్జునపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో బలుకూరి పద్మావతి అనే మహిళ ఫిర్యాదు చేసింది. తనను శారీరకంగా ఆర్థికంగా మోసం చేశారంటూ మేరుగ నాగార్జున పై సీఐ కళ్యాణ్ రాజుకు లిఖితపూర్వకంగా మహిళ ఫిర్యాదు చేసింది.
Andhra Pradesh: వైసీపీ వాళ్లు ఎవరైనా మాట్లాడితే బొక్కలో వేస్తాం, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, జగన్ ప్రభుత్వంలో ఎమ్మార్వో ఆఫీసులనే తాకట్టు పెట్టారని చంద్రబాబు మండిపాటు
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం (దీపం-2) ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ... అస్తవ్యస్తంగా మారిన రాష్ట్రాన్ని అందరం కలిసి పోరాడి కాపాడుకున్నామని అన్నారు. ఆడబిడ్డల కోసం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు.
KCR Re-Entry: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పొలిటికల్ రీ-ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడో కేటీఆర్ క్లారిటీ ఇచ్చేశారు.. మరి గులాబీ దళాధిపతి పురాగమనం ఎప్పుడంటే??
Rudraతెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య వార్ నడుస్తొందని చెప్పుకొవచ్చు. అమలుకు సాధ్యం కానీ హమీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిందని బీఆర్ఎస్ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తుండగా.. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల వల్లే తెలంగాణ వెనక్కు వెళ్లిందని కాంగ్రెస్ రివర్స్ ఎటాక్ కు దిగింది.
Modi: వన్ నేషన్-వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తున్నాం.. త్వరలోనే వన్ నేషన్ - వన్ సివిల్ కోడ్ తీసుకొస్తాం అని తేల్చిచెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
Arun Charagondaవన్ నేషన్-వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తున్నాం అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. గుజరాత్ లో మాట్లాడిన మోడీ..వన్ నేషన్-వన్ ఎలక్షన్‌తో దేశం మరింత బలపడుతుందన్నారు. వన్ నేషన్ - వన్ రేషన్‌తో పేద ప్రజలకు మేలు జరుగుతోందన్నారు. త్వరలోనే వన్ నేషన్ - వన్ సివిల్ కోడ్ తీసుకొస్తాం అని దీంతో దేశంలో వివక్షకు తెరపడుతుంది.. ఉగ్రవాదాన్ని ఉపేక్షించం అని తేల్చిచెప్పారు.
DK Shivakumar:ఫ్రీ బస్సు తీసేసే ఆలోచనలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం, ఉచిత బస్సు ప్రయాణంపై సమీక్షిస్తామని వెల్లడించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
Arun Charagondaఫ్రీ బస్సు తీసేసే ఆలోచనలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కర్నాటక మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని సమీక్షిస్తామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు.
CM Revanth Reddy: మహారాష్ట్ర ఎన్నికలు..కాంగ్రెస్ స్టార్ క్యాంపెనర్‌గా సీఎం రేవంత్ రెడ్డి, జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ అధిష్టానం...
Arun Charagondaమహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్‌ల జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ జాబితాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చోటు దక్కింది. గ్రెస్ చీఫ్ మల్లీకార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీతో పాటు రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సైతం ఈ జాబితాలో ఉన్నారు.
YSRCP on Vijayamma Open Letter: విజయమ్మ బహిరంగ లేఖపై స్పందించిన వైఎస్సార్సీపీ, అవి కుటుంబ ఆస్తులే అయితే ఎంవోయూ చేయాల్సిన అవసరం ఏంటని సూటి ప్రశ్న
Hazarath Reddyఅన్నా చెల్లెలు మధ్య కుటుంబ ఆస్తుల విషయం నేపథ్యంలో దివంగత వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ రాసిన సంగతి విదితమే. ఈ లేఖపై వైసీపీ స్పందించింది. వైఎస్ విజయమ్మ రాసిన లేఖపై స్పందిస్తూ ఈమేరకు వైఎస్సార్‌సీపీ ఆమెను ఉద్దేశించి ఓ లేఖను విడుదల చేసింది.
YS Vijayamma Letter on Property Dispute: వైఎస్సార్ అభిమానులకు విజయమ్మ బహిరంగ లేఖ, మా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావడం లేదంటూ ఆవేదన
Hazarath Reddyవైసీపీ అధినేత జగన్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య ఆస్తి పంపకాల వివాదం నేపథ్యంలో వారి తల్లి వైఎస్ విజయమ్మ స్పందించారు. ఈ మేరకు వైఎస్ఆర్ అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. ‘‘జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చాలా బాధేస్తోంది. జరగకూడనివన్నీ నా కళ్ల ముందే జరిగిపోతున్నాయి
YS Jagan Slams CM Chandrababu: రైతులను బాధపెట్టిన వారు బాగుపడినట్టుగా చరిత్రలో ఎక్కడా లేదు, సీఎం చంద్రబాబు ఉచిత పంటల బీమా పథకం రద్దు నిర్ణయంపై మండిపడిన జగన్
Hazarath Reddyపంటల బీమా ప్రీమియం రైతులే చెల్లించాలంటూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రైతులపైనే పంటల బీమా ప్రీమియం భారమా చంద్రబాబు అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించారు.
YS Family's Property Dispute: ఒక ఆర్థిక నేరస్థుడు పదకొండేళ్లుగా బెయిల్‌పై ఉండటమేంటి ? జగన్ మీద యనమల సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyతల్లి, చెల్లిపై కేసులేయడంతో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాతాళంలోకి పడిపోయారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆయన చేయి పట్టుకున్నోళ్లంతా పాతాళంలోకే అని ఎద్దేవా చేశారు.
YS Family's Property Dispute: ఆడబిడ్డ కన్నీరు జగన్ ఇంటికి అరిష్టం, వైఎస్ కుటుంబం ఆస్తుల వివాదంపై స్పందించిన బాలినేని శ్రీనివాసులు రెడ్డి
Hazarath Reddyమాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి, ఆయన సోదరి, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తాజాగా స్పందించారు. వైఎస్ కుటుంబం ఆస్తుల కోసం తగదాలు పడటం బాధాకరమని అన్నారు.
Tamilnadu: విజయ్ 'టీవీకే' పార్టీ తొలి బహిరంగసభ, లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలు, తన ప్రసంగంతో ప్రజలను ఆలోచింప చేసిన విజయ్...డ్రోన్ వీడియో ఇదిగో
Arun Charagondaఇళయ దళపతి విజయ్ స్థాపించిన పొలిటికల్ పార్టీ తొలి బహిరంగసభకు లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. తమిళనాడులోకి విల్లుపురం జిల్లాలో నిర్వహించిన భారీ బహిరంగసభకు 8 లక్షలకు పైగా జనం వచ్చి ఉంటారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రిలీజ్ చేసిన డ్రోన్ విజువల్స్‌లో జన సునామీ స్పష్టంగా కనిపించింది.
Tamil Nadu: తమిళ హీరో విజయ్ టీవీకే మహానాడు..విళుపురం జిల్లాలో భారీగా ఏర్పాట్లు, తొలిసారి తమిళ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతుండగా అందరి దృష్టి విజయ్‌పైనే
Arun Charagondaఇవాళ తమిళనాడు హీరో విజయ్ పార్టీ టీవీకే మహానాడు మహానాడు జరగనుంది. టీవీకే మొదటి మహానాడు కావడంతో విళుపురం జిల్లా విక్రవాండిలో భారీగా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి టీవీకే మహానాడు జరగనుండగా తిరుచ్చి జాతీయ రహదారిలో సుమారు 3 కిలోమీటర్ల మేర జెండాలు, విద్యుత్ దీపాలంకరణ చేపట్టారు. పార్టీ ప్రకటించిన తర్వాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు హీరో విజయ్.
Delhi BJP President: యమునా నదిలో స్నానం.. ఆస్పత్రి పాలైన ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్,ఊపిరి- స్కిన్ సమస్యలతో ఆస్పత్రిలో చేరిక
Arun Charagondaయమునా నదిలో స్నానం.. అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్. యమునా నది ప్రక్షాళనకు ఉద్దేశించిన నిధుల్లో ఢిల్లీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ.. నిరసనగా రెండు రోజుల క్రితం ఐటీవో ఘాట్ వద్ద నదిలో స్నానం చేశారు. అనంతరం ఆయనకు ఊపిరి తీసుకోవడంలో సమస్యలు, స్కిన్ అలర్జీస్ రావడంతో RML నర్సింగ్ ఆస్పత్రిలో చేరారు.