Politics

Exit Poll 2024 Date and Time: జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్ ఫలితాలు, ఈసీ ట్వీట్ ఇదిగో..

Hazarath Reddy

లోక్‌సభ ఎన్నికల 2024 ఎగ్జిట్ పోల్ ఫలితాలు జూన్ 1, శనివారం సాయంత్రం 6.30 గంటల తర్వాత ప్రకటించబడతాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల తర్వాత వివిధ వార్తా ఛానెల్‌ల ద్వారా అందుబాటులోకి వస్తాయని ఎలక్షన్ కమీషన్ పేర్కొన్నట్లు గమనించాలి.

Andhra Pradesh Elections Results 2024: పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంపై వెనక్కి తగ్గిన ఈసీ, ఏపీ సీఈవో జారీ చేసిన మెమో వెనక్కి తీసుకుంటున్నట్లు హైకోర్టుకు స్పష్టం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు నిబంధనల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈసీ నిబంధనలకు భిన్నంగా ఏపీ సీఈవో ముకేష్‌ కుమార్‌ మీనా జారీ చేసిన మెమోను ఉపసంహరించుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు గురువారం తెలిపింది

PM Modi Remarks on Mahatma Gandhi: మహాత్మా గాంధీ భక్తులకు, గాడ్సే భక్తులకు మధ్య ఎన్నికలు, జాతిపితపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడిన కాంగ్రెస్

Hazarath Reddy

PM Modi on Mahatma Gandhi: వీడియో ఇదిగో, 1982 వరకు మహాత్మాగాంధీ ఎవరో ప్రపంచానికి తెలియదు, ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

స్వాతంత్య్ర సమరయోధుడు జాతిపిత మహాత్మాగాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీపై 1982లో సినిమా తీసే వరకు ఆయనెవరో ప్రపంచానికి తెలియదని వ్యాఖ్యానించారు.ఏబీపీ న్యూస్‌ చానెల్‌కు మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు

Advertisement

Telangana Phone Tapping Case: హైకోర్టు జడ్జీలు, లాయర్ల ఫోన్లు కూడా ట్యాపింగ్, సుమారు 1200 మంది ఫోన్లు ట్యాప్‌, ఊహించని ట్విస్టులతో సాగుతున్న తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు

Hazarath Reddy

గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులపై కూడా నిఘా పెట్టిందని అరెస్టయిన పోలీసు అధికారి ఒకరు తన విచారణలో వెల్లడించినట్లు బుధవారం అధికార వర్గాలు తెలిపాయి.

Karan Bhushan Convoy Accident: బీజేపీ ఎంపీ కొడుకు కరణ్ కాన్వాయ్ ఢీకొని ఇద్దరు మృతి, చిక్కుల్లో బ్రిజ్‌భూషణ్‌, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణలతో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ (Brij Bhushan Singh) మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆయన తనయుడు కరణ్ భూషణ్‌ సింగ్‌ కాన్వాయ్‌లోని కారు వాహనదారులపైకి దూసుకెళ్లింది. దాంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గాయపడ్డారు.

Arvind Kejriwal's Bail Plea: అరవింద్‌ కేజ్రీవాల్‌ బెయిల్‌ పొడిగింపు అభ్యర్థనపై షాకిచ్చిన సుప్రీంకోర్టు, బెయిల్ పొడిగింపు పిటిషన్‌ విచారణకు నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం

Hazarath Reddy

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు సుప్రీంకోర్టులో భారీ షాక్‌ తగిలింది. తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజులు పొడిగించాలంటూ అత్యున్నత న్యాయస్థానంలో (Supreme Court) ఢిల్లీ సీఎం పిటిషన్‌ వేసిన (bail extension plea) విషయం తెలిసిందే.

Pinnelli Ramakrishna Reddy: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్, జూన్‌ 6వ తేదీ వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టరాదని ఏపీ హైకోర్టు ఆదేశాలు

Hazarath Reddy

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 3 కేసుల్లో ముందస్తు బెయిల్‌ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్‌ షరతులే వర్తిస్తాయని హైకోర్టు పేర్కొంది. జూన్‌ 6వ తేదీ వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకూడదని హైకోర్టు ఆదేశించింది

Advertisement

AP Counting Day Arrangements: కౌంటింగ్‌ కు ఏపీ సన్నద్ధం.. పోలింగ్ రోజున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్.. స్ట్రాంగ్‌ రూమ్‌ ల వద్ద కట్టుదిట్టమైన చర్యలు.. కేంద్రం నుంచి రాష్ట్రానికి మరో 20 కంపెనీల బలగాలు.. కౌంటింగ్ రోజున డ్రై డే

Rudra

జూన్ 4న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ కు ఆంధ్రప్రదేశ్ సర్వం సిద్ధం అవుతున్నది. పోలింగ్ రోజున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగిన విషయం తెలిసిందే.

SC on Party Poll Manifesto: పార్టీల మేనిఫెస్టోల్లోని హామీలను ప్రజలు నమ్మితే ఎవరేం చేస్తారు, సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు, ఆ వాగ్దానాలను ‘అవినీతి’గా పరిగణించలేమని వెల్లడి

Hazarath Reddy

రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేసే వాగ్దానాలు ఎన్నికల చట్టాల ప్రకారం అవినీతి కిందకు రావని భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) పేర్కొంది. హామీలు ఇవ్వడం అంటే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఓటర్లకు ఆర్థిక సాయం చేసినట్లే అవుతుందని, ఇది అవినీతేనని పిటిషనర్‌ చేసిన వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు

Rahul Gandhi Stage Collapse Video: రాహుల్‌ గాంధీకి తృటిలో తప్పిన ప్రమాదం, బీహార్‌‌లో కృంగిపోయిన సభావేదిక, వీడియో ఇదిగో..

Hazarath Reddy

సోమవారంనాడు బీహార్‌ (Bihar)లో జరిగిన ఎన్నికల సభలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వివరాల్లోకెళితే.. పాటలీపుత్ర లోక్‌సభ నియోజకవర్గంలోని పాలిగంజ్‌లో ఓ సభలో రాహుల్ గాంధీని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి వేదిక పైకి తీసుకువెళ్తుండగా వేదికలోని ఒక భాగం కిందకు కృంగిపోయింది.

Delhi Excise Policy Case: క్యాన్సర్‌తో పాటు కిడ్నీ వ్యాధుల లక్షణాలు, అరవింద్ కేజ్రీవాల్ ఆకస్మిక బరువు తగ్గుదల, మధ్యంతర బెయిల్‌ను ఏడు రోజుల పాటు పొడిగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్

Hazarath Reddy

తాను వైద్య పరీక్షలు చేయించుకోవాల్సినందున తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.

Advertisement

MLC Election Telangana: మొదలైన పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్‌.. బరిలో 52 మంది అభ్యర్థులు.. 4.63 లక్షల మంది ఓటర్లు.. వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఉపఎన్నిక.. సాయంత్రం 4 దాకా కొనసాగనున్న పోలింగ్‌

Rudra

ఉమ్మడి నల్లగొండ – వరంగల్‌- ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక మొదలైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనున్నది. మూడు జిల్లాల్లో కలిపి 4,63,839 మంది ఓటర్లు ఉన్నారు.

2024 భారత దేశం ఎన్నికలు: 58 లోక్‌ సభ స్థానాలకు మొదలైన 6వ దశ పోలింగ్.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదలైన ఓటింగ్.. బరిలో 889 మంది అభ్యర్థులు.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్ ప్రక్రియ

Rudra

లోక్‌ సభ ఎన్నికల్లో భాగంగా ఆరవ దశ పోలింగ్ నేడు ఉదయం 7 గంటలకు మొదలైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.

RCB Fans Fire on Ambati Rayudu: అంబటి రాయుడును కామెంట్లతో ఉతికి ఆరేస్తున్న కోహ్లీ ఫ్యాన్స్‌, రిటైర్మెంట్‌పై యూటర్నులు తీసుకోవడం తప్ప మీరు ఏం చేశారంటూ మండిపాటు

Vikas M

ఐపీఎల్‌-2024లో ప్లే ఆఫ్స్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో పరాజయం పాలైన సంగతి విదితమే. ఆ తర్వాత పుంజుకుని ప్లే అప్ చేరినా రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. అయితే ఆర్సీబీతో మ్యాచ్ లో చెన్నై ఓడిపోయిన తర్వాత సీఎస్‌కే మాజీ బ్యాటర్‌ అంబటి రాయుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్‌ చేశాడు

Swati Maliwal 'Assault' Case: స్వాతిమలివాల్‌పై దాడి కేసు, కేజ్రీవాల్‌ సహాయకుడు బిభవ్‌కుమార్‌కు 4 రోజుల రిమాండ్‌, ఎంపీ పదవికి రాజీనామా చేయనని తెలిపిన ఆప్ ఎంపీ

Hazarath Reddy

ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) ఎంపీ స్వాతిమలివాల్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడైన బిభవ్‌కుమార్‌కు కోర్టు 4 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. దీంతో పోలీసులు బిభవ్‌కుమార్‌ను రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Voter Turnout Data: బూత్ ఓట‌ర్ల డేటా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ కుద‌ర‌దు, ఏడీఆర్ పిటీష‌న్ తిర‌స్క‌రించిన సుప్రీంకోర్టు, ఓట‌ర్లు అయోమ‌యంలో ప‌డే అవ‌కాశం ఉందని తెలిపిన ఈసీ

Hazarath Reddy

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ప్రతి దశ పోలింగ్ ముగిసిన తర్వాత తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఓటరు ఓటింగ్‌కు సంబంధించిన ప్రామాణీకరణ రికార్డును వెల్లడించాలని భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)కి మధ్యంతర ఆదేశాలు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది.

2024 భారత దేశం ఎన్నికలు: లోక్‌ సభ ఎన్నికల బరిలో 8,360 మంది.. 1996 తర్వాత ఇదే అత్యధికం.. వయోవృద్ధులు.. నిరక్షరాస్యులు కూడా పోటీలోనే.. పూర్తి వివరాలు ఇవిగో!

Rudra

ఏడు దఫాలలో ప్రస్తుతం జరుగుతున్న లోక్‌ సభ ఎన్నికల్లో ఏకంగా 8,360 మంది పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం వెల్లడించింది.

Kodali Nani Health Update: సోఫాలో అనారోగ్యంతో కుప్పకూలారంటూ వచ్చిన వార్తలకు సోఫాలోనే కూర్చుని కౌంటర్ ఇచ్చిన కొడాలి నాని, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తనకు అనారోగ్యమంటూ వచ్చిన వార్తల్ని వైసీపీ నాయకుడు కొడాలి నాని ఖండించారు. తాజాగా తాను కుర్చీలో కూర్చున్న వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. కొడాలి నాని అనారోగ్యం తో సోఫా లో కుప్పకులాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్న సంగతి విదితమే.

Asaduddin Owaisi on POK: పీవోకేపై అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు, అది భారత్‌లో అంతర్భాగమే కాని బీజేపీ ఎన్నికల సమయంలోనే..

Hazarath Reddy

పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకోవాలనే అంటున్నామన్నారు. కానీ బీజేపీ ఎన్నికల సమయంలోనే ఈ అంశాన్ని తెరపైకి ఎందుకు తీసుకువస్తోంది? అని ప్రశ్నించారు. బీజేపీ నేత‌లు పీవోకే గురించి ప‌దేప‌దే మాట్లాడుతున్నారని... ఈ పదేళ్లలో పీఓకేను స్వాధీనం చేసుకునేందుకు వారేం చేశారో చెప్పాలని నిలదీశారు.

Advertisement
Advertisement