BJP-AAP Delhi Face-Off: బీజేపీ రూ. 800 కోట్ల బేరం.. అజ్ఞాతంలో ఆప్ ఎమ్మెల్యేలు, ఢిల్లీలో వేడెక్కిన రాజకీయాలు, పబ్లిక్ స్టంట్ కోసమే ఆప్ ఆరోపణలంటూ కొట్టిపారేసిన బీజేపీ
Delhi Chief Minister Arvind Kejriwal (Photo Credits: Agencies)

New Delhi, August 25: ఢిల్లీ ప్రభుత్వాన్ని కూలదొసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణల మధ్య అక్కడ రాజకీయాలు (BJP-AAP Delhi Face-Off) శరవేగంగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లారన్న వార్తలు (Some Are Not Reachable) ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party -AAP) కీలక సమావేశం గురువారం జరగనున్న సమయంలో ఆ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలతో బీజేపీ (BJP) బేరసారాలు జరుపుతోందని ఆరోపణలు వస్తున్నాయి.

బీజేపీలో చేరితే తమకు ఒక్కొక్కరికి రూ.20 కోట్లు ఇస్తామని ఆ పార్టీ నేతలు తమకు ఆఫర్ ఇచ్చారని నలుగురు ఆప్ ఎమ్మెల్యేలు (AAP MLAs) ఇదివరకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్ ఎమ్మెల్యేల సమావేశం గురువారం జరగబోతోంది. ఆప్ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం కొందరు ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి అందుబాటులో లేరు.ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశానికి ముందు పలువురు ఎమ్మెల్యేల ఫోన్లు కలవటం లేదని, వారితో మాట్లాడలేకపోయినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ప్రాణాలైనా వ‌దులుతాం,బీజేపీలోకి వెళ్లే ప్రసక్తే లేదు, బీజేపీలో చేరితే రూ.20కోట్లు, ఎమ్మెల్యేలను తీసుకెళ్తే రూ.25 కోట్లు ఆఫర్‌పై ఆప్ ఎమ్మెల్యేలు

ఈ క్రమంలో మొత్తం మంది ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరవుతారని ధీమా వ్యక్తం చేశారు ఆప్‌ నేత దిలీప్‌ పాండే. అయితే, 40 మంది ఎమ్మెల్యేలను లాగేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.ఎమ్మెల్యేలందరితో టచ్‌లో ఉన్నాం. బుధవారమే అందరికి సందేశాలు పంపించాం. ఫోన్లు కలవని వారికి సైతం సందేశాలు చేరుతాయి. మీటింగ్‌కు ఎమ్మెల్యేలంతా హాజరవుతారు. 40 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేపట్టింది’ అని పేర్కొన్నారు దిలీప్‌ పాండే. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌కు 62 మంది ఎమ్మెల్యేలు ఉ‍న్నారు. అయితే, పలువురు ఎమ్మెల్యేల ఆచూకీ లభించకపోవటంతో ఆప్‌ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది.

2024లో బీజేపీ గెలుపుపై సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు, ప్రధానిగా తాను రేసులో ఉండనని వెల్లడి

మరోవైపు.. బీజేపీలో చేరే ఎమ్మెల్యేలకు రూ.20 కోట్లు ఇచ్చేందుకు కాషాయపార్టీ ఆఫర్‌ చేసిందని బుధవారం ఆరోపించారు సౌరభ్‌ భరద్వాజ్‌. అంతకు ముందు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా సైతం బీజేపీపై ఆరోపణలు చేశారు. తనపై ఉన్న కేసులను ఎత్తివేయాలంటే బీజేపీలో చేరాలంటూ ఆఫర్‌ ఇచ్చారని, అందుకు తాను అంగీకరించలేదని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పలు వేదికల మీదుగా ఆరోపణలు చేశారు.

ఆప్ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) బుధవారం సమావేశమైంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని ఖండిస్తూ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. కోట్లాది రూపాయలు ఆశ చూపించి, తమ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఢిల్లీ రాష్ట్ర మద్యం విధానంలో అక్రమాలు జరిగినట్లు సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, మరో 14 మందిపై కేసు నమోదు చేసింది.

నితీష్ కుమార్ ప్రభుత్వానికి సీబీఐ షాక్, ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ కుంభకోణంలో ఆర్జేడీ నాయకుల ఇళ్లపై దాడులు, బలపరీక్షకు ముందే దాడులు.

రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ స్మారకాన్ని సందర్శించిన అనంతరం ఢిల్లీ సీఎం సంచలన ఆరోపణ చేశారు.కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీలో అక్రమాలు జరిగినట్లు ఆరోపిస్తూ సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) దాడులు నిర్వహించిన మర్నాడు మనీశ్ సిసోడియా (Manish Sisodia)ను బీజేపీ సంప్రదించిందని చెప్పారు. కేజ్రీవాల్‌కు ద్రోహం చేస్తే ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఆశపెట్టిందన్నారు.

అదృష్టవశాత్తూ మనీశ్ సిసోడియాకు ముఖ్యమంత్రి పదవిపై దురాశలేదన్నారు. ఆప్ ఎమ్మెల్యేలు చావనైనా చస్తారు కానీ అమ్ముడుపోరన్నారు. ‘‘నా ప్రభుత్వాన్ని కూల్చాలంటే బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. అందుకోసం రూ.800 కోట్లు సిద్ధం చేసుకుంది’’ అన్నారు. బీజేపీ ఆపరేషన్ లోటస్ విఫలమవాలని కోరుతూ ఆప్ ఎమ్మెల్యేలు మహాత్మా గాంధీ మెమోరియల్‌ను సందర్శించారు.

ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ, తాము తుది శ్వాస వరకు పార్టీతోనే ఉంటామని అందరు ఎమ్మెల్యేలు చెప్పారని తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగిన సమావేశానికి 53 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని తెలిపారు. ఏడుగురు ఎమ్మెల్యేలు ఇతర ప్రాంతాలకు వెళ్ళారని, మంత్రి సత్యేందర్ జైన్ జైలులో ఉన్నారని, మరొకరు ఫోన్ ద్వారా పాల్గొన్నారని చెప్పారు. ఈ సమావేశంలో మాట్లాడిన 12 మంది ఎమ్మెల్యేలు తమను బీజేపీకి చెందినవారు సంప్రదించారని చెప్పారు.ఇదిలావుండగా, ఆప్ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. ఈ ఆరోపణలు పబ్లిక్ స్టంట్ అని కొట్టిపారేసింది.