ఢిల్లీ మునిసిపల్ (ఎంసీడీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ నెల 4న జరిగిన ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. మొత్తం 250 వార్డుల్లోని 1,349 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తాజాగా వెల్లడవుతున్న ఫలితాల్లో బీజేపీ 14 స్థానాల్లో ఘన విజయం సాధించింది, ఆప్ 14 సీట్లలో విజయం సాధించింది.కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలు గెలుచుకుంది.
ప్రస్తుతం బీజేపీ 91 సీట్లలో లీడ్ లో ఉండగా ఆమ్ ఆద్మీ 116 సీట్లలో లీడ్ లో ఉంది. కాంగ్రెస్ 9, ఇండిపెండెంట్ 3, బీఎస్పీ 1 ఆధిక్యంలో ఉన్నాయి.కౌంటింగ్ జరుగుతోంది. 2017లో జరిగిన ఎన్నికల్లో అప్పట్లో ఉన్న 270 స్థానాలకు గాను 181 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది.
Here's ANI Tweet
#DelhiMCDPolls | BJP and AAP win 14 seats each; Congress wins 2 seats. BJP currently leads on 91 seats & AAP leads on 116 seats, as the counting of votes continues.
Congress leading on 9, Independent on 3, BSP on 1.
Counting is underway for 250 wards. pic.twitter.com/2nc0hx322t
— ANI (@ANI) December 7, 2022
ఆప్ 48 స్థానాలతో రెండో స్థానంలో నిలవగా కాంగ్రెస్ 30 స్థానాలతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది.