![](https://test1.latestly.com/wp-content/uploads/2020/02/Arvind-Kejriwal-on-delhi-violence-380x214.jpg)
New Delhi, Dec 6: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎనిమిది నుంచి 10 స్థానాలకు పరిమితం అవుతుందని ఎగ్జిట్ పోల్స్ (Gujarat exit polls analysis) స్పష్టంచేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రివాల్ (Kejriwal on Exit Polls) స్పందించారు. గుజరాత్ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ లెక్క తప్పుతుందని కేజ్రివాల్ (Delhi Chief Minister) వ్యాఖ్యానించారు.
అక్కడ తాము దాదాపు 100 స్థానాలు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్‌లో ఓ కొత్త పార్టీ 15 నుంచి 20 శాతం ఓట్లు రావడం, అది కూడా బీజేపీ కంచుకోటగా ఉన్న గుజరాత్‌లో చాలా పెద్ద విషయమని అన్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకు వేచి ఉంటామని తెలిపారు.
మొత్తం 182 నియోజకవర్గాలున్న గుజరాత్ అసెంబ్లీలో మెజారిటీ స్థానాలను బీజేపీ గెలుచుకుని మళ్లీ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు 38 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నదని, ఆప్ (Aam Aadmi Party) మాత్రం సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతుందని, ఆ పార్టీ కేవలం 8 స్థానాల్లో మాత్రమే గెలిచే చాన్స్ ఉందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెల్లడించాయి.
ఇదిలా ఉంటే హిమాచల్‌లో కాంగ్రెస్‌కు మద్దతిస్తారా అనే ప్రశ్నకు సమాధానం దాటవేశారు కేజ్రీవాల్. మరోవైపు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఆప్ విజయ కేతనం ఎగురవేయనున్నట్లు ఎగ్జిట్ పోల్స్‌లో తేలింది. 250 సీట్లున్న ఢిల్లీ కార్పొరేషన్‌లో ఆప్ 150 సీట్లకు పైగానే గెల్చుకునే అవకాశం ఉన్నట్లు దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. దీంతో 15 ఏళ్ల తర్వాత ఎంసీడీ పీఠాన్ని బీజేపీ ఆప్‌కు అప్పగించబోతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 100 లోపు సీట్లకే పరిమితమవుతున్నట్లు తేలిపోయింది.