Ganesh Immersion 2022 (Photo-ANI)

Hyd, Sep 9: గణేశ్‌ నిమజ్జనానికి హైదరాబాద్ ముస్తాబైంది.తొమ్మిది రోజుల పాటు భక్తి, శ్రద్ధలతో కొలిచిన భక్తులు.. ఆయన్ని అంగరంగ వైభవంగా గంగమ్మ ఒడికి చేర్చే ఘట్టం (ganesh nimajjanam in hyderabad) ఆసన్నమైంది. నగర వ్యాప్తంగా ఉన్న చిన్న వినాయకులు మొదలు భారీ గణనాథులు ట్యాంక్‌బండ్‌, ఆయా చెరువుల వైపు కదులుతూ బైబై (ganesh nimajjanam) చెప్పనున్నారు.

ఈనేపథ్యంలో పోలీసులు హైదరాబాద్‌ మహానగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్‌ పోలీసులు ప్రకటించారు. దీనికి సంబంధించి సైన్‌బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌పై సమాచారానికి ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఎఫ్‌ఎం రేడియో ద్వారా ప్రకటిస్తున్నారు. సందర్శకుల వాహనాలను నిలిపేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. శోభాయాత్ర జరిగే ప్రధాన రహదారుల్లో సాధారణ వాహనాలను అనుమతించరు.

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి.. తెలంగాణ, ఏపీకి నేడు భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

దాదాపు 24,132 మంది పోలీసులు, 122 ప్లటూన్ల సాయుధ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి లేదా శనివారం తెల్లవారుజాము లోపు నిమజ్జనాలు పూర్తయ్యేలా ప్రణాళికలు రచించారు. నిమజ్జన ఊరేగింపులు (Ganesh Visarjan ) ఉదయం 6 గంటలకే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శుక్రవారం నుంచి 24 గంటల పాటు నగరంలో మద్యం విక్రయాలు నిషేధించారు.

Here's Telangana State Police Tweet

ఊరేగింపు కేశవగిరి నుంచి ప్రారంభమవుతుంది. చాంద్రాయణగుట్ట-ఎడమ మలుపు-మహబూబ్‌నగర్‌ ఎక్స్‌ రోడ్-ఫలక్‌నుమా ఆర్‌వోబీ-అలియాబాద్-నాగుల్చింత-చార్మినార్-మదీనా-అఫ్జల్‌గంజ్-ఎస్‌ఏ బజార్-ఎంజే మార్కెట్-అబిడ్స్-బర్కర్‌షీర్-అబిడ్స్-ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్‌ఆర్‌ మార్గ్ (నెక్లెస్ రోడ్) వైపు.

సికింద్రాబాద్ ప్రాంతం నుంచి.. ఆర్పీ రోడ్-ఎంజి రోడ్-కర్బలా మైదాన్-కవాడిగూడ-ముషీరాబాద్ ఎక్స్ రోడ్-ఆర్టీసీ ఎక్స్ రోడ్-నారాయణగూడ ఎక్స్ రోడ్-హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్ మీదుగా వెళ్లి లిబర్టీ వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తుంది. చిల్కలగూడ ఎక్స్ రోడ్స్ నుంచి వచ్చే విగ్రహాలు ముషీరాబాద్‌లో చేరుతాయి. గాంధీ హాస్పిటల్ మీదుగా ‘X’ రోడ్లు.

ఈస్ట్‌జోన్ నుంచి.. ఉప్పల్-రామంతపూర్-6 నంబర్ జంక్షన్ అంబర్‌పేట్-శివం రోడ్-ఓయూ వద్ద ఎన్‌సీసీ-దుర్గాబాయిదేశ్‌ముఖ్ హాస్పిటల్-హిందీ మహావిద్యాలయ ఎక్స్ రోడ్స్-ఫీవర్ హాస్పిటల్-బర్కత్‌పురా ఎక్స్ రోడ్స్-నారాయణగూడఎక్స్ రోడ్స్ నుంచి వెళ్లి ఆర్టీసీ ఎక్స్‌ రోడ్స్ నుంచి వచ్చే ఊరేగింపులో కలుస్తుంది. అలాగే దిల్ సుఖ్‌నగర్ నుంచి విగ్రహాలు ఐఎస్‌ సదన్-సైదాబాద్-చంచల్ గూడాత్ నల్లగొండ ఎక్స్‌ రోడ్‌ నుంచి వచ్చే ఊరేగింపులో చేరాయి. కొన్ని పెద్ద విగ్రహాలు మూసారాంబాగ్ మీదుగా అంబర్ పేట్ వైపు వెళ్తాయి. తార్నాక వైపు నుంచి వచ్చే విగ్రహాలు ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ రోడ్డు, అడిక్‌మెట్ మీదుగా విద్యానగర్ మీదుగా ఫీవర్ హాస్పిటల్ వద్ద ఊరేగింపుగా చేరాయి.

Here's Route Map 

map

టోలిచౌకి, రేతిబౌలి, మెహదీపట్నం వైపు నుంచి ఊరేగింపులు మాసబ్ ట్యాంక్, అయోధ్య జంక్షన్-నిరంకారి భవన్-సైఫాబాద్ పాత పోలీస్‌స్టేషన్‌-ఇక్బాల్మినార్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వరకు వెళ్తాయి. ఎర్రగడ్డ నుంచి వచ్చే విగ్రహాలు ఎస్‌ఆర్‌నగర్‌-అమీర్‌పేట-పంజాగుట్ట-ఖైరతాబాద్‌ మీదుగా మెహదీపట్నం నుంచి వచ్చే ఊరేగింపు నిరంకారిభవన్‌లో చేరి ఎన్టీఆర్‌ మార్గ్‌కు చేరుకుంటాయి.

టప్పాచబుత్ర, ఆసిఫ్‌నగర్ వైపు నుండి వచ్చే విగ్రహాలు-సీతారాంబాగ్-బోయిగూడ కమాన్-వోల్గా హోటల్-గోషామహల్ బరాదరి-అలాస్కా మీదుగా ఎమ్‌జె మార్కెట్‌లోని ప్రధాన ఊరేగింపులో చేరి, అబిడ్స్-బషీర్‌బాగ్-లిబర్టీ-అంబేద్కర్ విగ్రహం-ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్‌ఆర్‌ మార్గ్ (నెక్లెస్‌ రోడ్) వైపు వెళ్తాయి.

ప్రధాన నిమజ్జన కేంద్రమైన హుస్సేన్‌సాగర్‌లోనే మూడు కమిషనరేట్లలో అనేక విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. ఈ నేపథ్యంలో దాని చుట్టూ అందుబాటులో ఉన్న 66 సీసీ కెమెరాలకు తోడు అదనంగా అవసరమైన ప్రాంతాల్లో 27 ఏర్పాటు చేస్తున్నారు. 500 మీటర్ల పరిధిలో ఫేషియల్‌ రికగ్నేషన్‌ సిస్టమ్‌తో పని చేసే 10 మెగా పిక్సల్‌ కెమెరాలు ట్యాంక్‌బండ్‌ చుట్టూ ఏర్పాటు చేశారు

హుస్సేన్‌సాగర్‌ వద్ద నిర్వహించనున్న నిమజ్జన వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల కోసం ఆర్టీసీ 565 బస్సులను అదనంగా నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. శనివారం తెల్లవారు జాము వరకు బస్సులు నడుస్తాయి. శుక్రవారం నుంచి శనివారం తెల్లవారుజాము వరకు ఎంఎంటీఎస్‌ రైళ్లు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా శుక్రవారం అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు నడుస్తాయి.

నిమజ్జన ఊరేగింపుల పర్యవేక్షణకు నగర పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటున్నారు. ప్రతి వినాయక మండపానికీ ఓ ప్రత్యేకమైన క్యూఆర్‌ కోడ్‌ కేటాయించడంతో పాటు వాటికి జియో ట్యాగింగ్‌ చేస్తున్నారు. ఇలా దాదాపు 9 వేల విగ్రహాలను చేశారు. పోలీసుల వద్ద రిజిస్టర్‌ చేసుకున్న గణేష్‌ విగ్రహాల వివరాలతో పోలీసులు ప్రత్యేకంగా క్యూఆర్‌ కోడ్‌ ముద్రించి అందిస్తున్నారు.

గణేష్‌ నిమజ్జనానికి సైబరాబాద్‌ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం జరిగే 35 చెరువుల వద్ద తొలిసారిగా డ్రోన్లు, బాడీవార్న్‌ కెమెరాలతో అనుక్షణం పర్యవేక్షించనున్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే డయల్‌ 100 లేదా 94906 17444ను సంప్రదించాలి.