
భారతదేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 జనవరి 26 నుంచి ప్రతి ఏడాది జనవరి 26 ని గణతంత్ర దినోత్సవంగా (Republic Day 2023) జరుపుకుంటున్నాం. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా జనవరి 26, 2023న భారతదేశం తన 74వ రిపబ్లిక్ డేని (Gantantra Diwas 2023) జరుపుకోబోతుంది. దీనిని గణతంత్ర దివాస్ అని కూడా పిలుస్తారు. జనవరి 26, 1950న రాజ్యాంగం అమలులోకి వచ్చిన శుభ సందర్భంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో సహా దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు.
ప్రతి ఏడాది ప్రధాన గణతంత్ర దివాస్ ను జనవరి 26న న్యూఢిల్లీలోని రాజ్ పథ్ లేదా కర్తవ్య మార్గంలో నిర్వహిస్తారు.భారత సైన్యం, భారత నౌకాదళం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భాగస్వామ్యంతో జనవరి 26న విస్తృతమైన రిపబ్లిక్ డే పరేడ్ జరుగుతుంది.ఈ ఏడాది జరిగే గణతంత్ర వేడుకలకు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్- సిసి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
గణతంత్ర దినోత్సవ పరేడ్ 2023 ప్రత్యక్ష ప్రసారం కర్తవ్య పథ్ నుంచి ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానుంది. ఎప్పటి మాదిరిగానే ప్రధాని అమర్ జవాన్ జ్యోతిని సందర్శిస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. భారత రాష్ట్రపతి జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత గణతంత్ర దినోత్సవ పరేడ్ నిర్ణీత సమయంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ పరేడ్ రాష్ట్రపతి భవన్ నుంచి రాజ్ పథ్ వెంట ఇండియా గేట్ వరకు అక్కడి నుంచి ఎర్రకోట వరకు సాగుతుంది. ఈ మార్గం ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉంటుంది.
ఈ సంవత్సరం రిపబ్లిక్ డే వేడుకలు పునరుద్ధరించబడిన సెంట్రల్ విస్టా అవెన్యూలో జరుగనున్నాయి. ప్రభుత్వం ప్రజల కోసం ఆన్‌లైన్లో 32,000 టిక్కెట్లను విక్రయించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు బుధవారం వెల్లడించారు.అంతేగాక, తొలిసారిగా ఈ వేడుకకు సంబంధించిన అధికారిక ఆహ్వానాలను ఆన్‌లైన్లో పంపనున్నట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరం రాజ్‌పథ్ పేరును కర్తవ్య పథ్ గా మార్చిన తర్వాత సెరిమోన్గియల్ బౌలేవార్డ్ లో నిర్వహించబడుతున్న తొలి రిపబ్లిక్ డే వేడుకలు ఇవే.
అల్లాహు అక్బర్ అని అరుస్తూ ప్రయాణికులను నరికివేసిన ముస్లింలు, బెల్జియంలో దారుణ ఘటన
గణతంత్ర దినోత్సవ వేడుకలు జనభాగధారి(ప్రజల భాగస్వామ్యం) స్ఫూర్తితో జరుగుతాయి. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కార్మికులు, వారి కుటుంబసభ్యులు, కర్తవ్య మార్గంలోని నిర్వహణ కార్మికులు, కూరగాయల విక్రేతలు, మిల్క్ బూత్ కార్మికులు, కిరాణా దుకాణదారులు, రిక్షా పుల్లర్లు పాల్గొంటుండటం గమనార్హం. ప్రజెంటేషన్ సమయంలో అధికారులు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు