Hyd, Sep 9: గత రికార్డులను తిరగరాస్తూ 2022లో బాలాపూర్ లడ్డూ రికార్డు స్థాయి ధర పలికింది.వేలపాటలో రూ.24.60 లక్షలకు బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యుడైన వంగేటి లక్ష్మారెడ్డి గణనాథుని ప్రసాదాన్ని దక్కించుకున్నారు. ఇది గతేడాదికంటే రూ.5 లక్షల 70 వేలు అధికం కావడం విశేషం. 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలం పాట నిర్వహించలేదు. 2019లో రూ.17.6 లక్షలకు కొలను రాంరెడ్డి సొంతం చేసుకున్నారు.
మొత్తం వేలంలో తొమ్మిది మంది పాల్గొన్నారు.వారిలో ఆరుగురు స్థానికులు ఉండగా, ముగ్గురు స్థానికేతరులు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పాల్గొన్నారు.వేలంపాటలో లడ్డు గెలుపొందినవారు స్థానికులైతే మరుసటి ఏడాది, స్థానికేతరులైతే అప్పటికప్పుడు డబ్బు చెల్లించేలా నిబంధన విధించారు.
కాగా 1980లో బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి ఏర్పాటయింది. 1994లో లడ్డూ వేలం ప్రారంభమైంది. తొలి ఏడాది రూ.450కి లడ్డూ పాటలో దక్కించుకోగా 2017లో రూ.15 లక్షలు దాటింది. తొలిసారిగా 2020లో కరోనా కారణంగా బాలాపూర్ లడ్డూ వేలంపాట రద్దయింది.
Here's Winner Video
Lakshma Reddy bagged #Balapur Ganesh Laddu for Rs 24,60000 in auction held in #Balapur in Hyderabad on Friday. Large number of devotees participated. Express video @Vinaymadapu @XpressHyderabad @NewIndianXpress @Kalyan_TNIE @balaexpressTNIE @madhavitata @bgusofficial pic.twitter.com/VUV0Sn6Anr
— R V K Rao (@RVKRao2) September 9, 2022
194 నుంచి నేటి వరకు లడ్డూ వేలం-విజేతలు
1994లో కొలను మోహన్‌రెడ్డి- రూ.450
1995లో కొలను మోహన్‌రెడ్డి- రూ.4,500
1996లో కొలను కృష్ణారెడ్డి- రూ.18 వేలు
1997లో కొలను కృష్ణారెడ్డి- రూ.28 వేలు
1998లో కొలన్ మోహన్ రెడ్డి లడ్డూ- రూ.51 వేలు
1999 కళ్లెం ప్రతాప్ రెడ్డి- రూ.65 వేలు
2000 కొలన్ అంజిరెడ్డి- రూ.66 వేలు
2001 జీ రఘనందన్ రెడ్డి- రూ.85 వేలు
2002లో కందాడ మాధవరెడ్డి- రూ.1,05,000
2003లో చిగిరినాథ బాల్ రెడ్డి- రూ.1,55,000
2004లో కొలన్ మోహన్ రెడ్డి- రూ.2,01,000
2005లో ఇబ్రహీ శేఖర్- రూ.2,08,000
2006లో చిగురింత తిరుపతి- రెడ్డి రూ.3 లక్షలు
2007లో జీ రఘనాథమ్ చారి- రూ.4,15000
2008లో కొలన్ మోహన్ రెడ్డి- రూ.5,07,000
2009లో సరిత- రూ.5,10,000
2010లో కొడాలి శ్రీదర్ బాబు- రూ.5,35,000
2011లో కొలన్ బ్రదర్స్- రూ.5,45,000
2012లో పన్నాల గోవర్ధన్ రెడ్డి- రూ.7,50,000
2013లో తీగల కృష్ణారెడ్డి- రూ.9,26,000
2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి- రూ.9,50,000
2015లో కొలన్ మధన్ మోహన్ రెడ్డి- రూ.10,32,000
2016లో స్కైలాబ్ రెడ్డి- రూ.14,65,000
2017లో lనాగం తిరుపతి రెడ్డి రూ.15.60 లక్షలు
2018లో శ్రీనివాస్ గుప్తా- రూ.16,60,000
2019లో కొలను రామిరెడ్డి- రూ.17 లక్షల 60 వేలు
2020లో కరోనా కారణంగా లడ్డూ వేలం పాట రద్దు
2021లో మర్రి శశాంక్ రెడ్డి, ఏపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్- రూ.18.90 లక్షలు