Ugadi Telugu Wishes: శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు, ఈ కోట్స్ ద్వారా తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పేయండి
తెలుగువారి పండుగ ఉగాది రానే వచ్చేసింది. తెలుగు వాకిల్లలో శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉగాది సందడి మొదలైంది. చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాది నిర్ణయిస్తారు.
Ugadi Wishes and Quotes and Messages in Telugu: తెలుగువారి పండుగ ఉగాది రానే వచ్చేసింది. తెలుగు వాకిల్లలో శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉగాది సందడి మొదలైంది. చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాది నిర్ణయిస్తారు. ఈ పండుగను తెలుగువారే కాకుండా మరాఠీలు 'గుడిపడ్వా'గా, తమిళులు 'పుత్తాండు' అనే పేరుతో, మలయాళీలు 'విషు' అనే పేరుతో, సిక్కులు 'వైశాఖీ'గా, బెంగాలీలు 'పోయ్ లా బైశాఖ్' గా జరుపుకుంటారు.
ఉగాది అంటే ప్రతి ఒక్కరికీ గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది. జీవితంలో వచ్చే కష్టసుఖాలను అందరూ అనుభవించాలని గుర్తు చేసేదే ఉగాది పచ్చడి. ఇదిలా ఉండగా.. హిందూ పురాణాల ప్రకారం, ఉగాదిలో ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం.. ఈ గమనానికి ఆది ఉగాది.. అంటే దీనర్థం సృష్టి ఉగాది రోజు నుంచే ప్రారంభమైంది. ఒక యుగం అంటే ‘ద్వయం’ అని అర్థం.
తెలుగు పంచాంగం ప్రకారం ఉత్తరాయణం, దక్షిణాయణం ద్వయ సంయుతం యుగంగా మారింది. యుగాదికి ప్రతిరూపంగానే ఉగాది రూపాంతరం చెందింది.ప్రతి సంవత్సరం ఛైత్ర శుద్ధ పాడ్యమి నుంచి ఉగాది పండుగ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ప్రముఖ ఆలయాల్లో పండితులు పంచాంగ శ్రవణం పఠిస్తారు. ఈ నేపథ్యంలో మనం శుభకృత నామ సంవత్సరానికి వీడ్కోలు పలికి, శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం.

అందరూ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శోభకృత్ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు

మిత్రులందరికీ శోభకృత్ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు

ఉగాది పర్వదినాన మిత్రులంతా సంతోషంగా గడపాలని కోరుకుంటూ శోభకృత్ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శోభకృత్ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు
(The above story first appeared on LatestLY on Mar 21, 2023 10:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

