Ugadi Wishes and Quotes in Telugu: తెలుగువారి పండుగ ఉగాది రానే వచ్చేసింది. తెలుగు వాకిల్లలో శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉగాది సందడి మొదలైంది. చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాది నిర్ణయిస్తారు. ఈ పండుగను తెలుగువారే కాకుండా మరాఠీలు 'గుడిపడ్వా'గా, తమిళులు 'పుత్తాండు' అనే పేరుతో, మలయాళీలు 'విషు' అనే పేరుతో, సిక్కులు 'వైశాఖీ'గా, బెంగాలీలు 'పోయ్ లా బైశాఖ్' గా జరుపుకుంటారు.
ఉగాది అంటే ప్రతి ఒక్కరికీ గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది. జీవితంలో వచ్చే కష్టసుఖాలను అందరూ అనుభవించాలని గుర్తు చేసేదే ఉగాది పచ్చడి. ఇదిలా ఉండగా.. హిందూ పురాణాల ప్రకారం, ఉగాదిలో ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం.. ఈ గమనానికి ఆది ఉగాది.. అంటే దీనర్థం సృష్టి ఉగాది రోజు నుంచే ప్రారంభమైంది.
ఒక యుగం అంటే ‘ద్వయం’ అని అర్థం. తెలుగు పంచాంగం ప్రకారం ఉత్తరాయణం, దక్షిణాయణం ద్వయ సంయుతం యుగంగా మారింది. యుగాదికి ప్రతిరూపంగానే ఉగాది రూపాంతరం చెందింది.ప్రతి సంవత్సరం ఛైత్ర శుద్ధ పాడ్యమి నుంచి ఉగాది పండుగ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ప్రముఖ ఆలయాల్లో పండితులు పంచాంగ శ్రవణం పఠిస్తారు. ఈ నేపథ్యంలో మనం శుభకృత నామ సంవత్సరానికి వీడ్కోలు పలికి, శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం.
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ శోభకృత్ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు
ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసే పండుగ. శోభకృత్ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు
కష్ట సుఖాల జీవితంలో చవి చూడాలి మాధుర్యం. అదే ఉగాది పచ్చడి తెలియజెప్పే నిజం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు
రాబోతున్న కొత్త సంవత్సరం మధురమైన క్షణాలను అందించాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు