మీరెప్పుడైనా అయామ్ సెమనీ (Ayam Cemani) కోడిపుంజుల గురించి విన్నారా? ఇవి ఇండోనేషియా రకానికి చెందిన కోడి పుంజులు (Black rooster), చైనాలో వీటిని సిల్కీ (Silkie) పేరుతో పిలుస్తారు. చూడటానికి నల్లగా, మాడిపోయిన డాంబర్ చిప్పలాగా ఉంటాయి కానీ, వీటిని పట్టి, ఉప్పు కారం బాగా దట్టించి సన్నని సెగ మీద బాగా వేయించుకొని తింటే ఆహా స్వర్గం. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం గ్యారెంటీ అని తిన్నవాళ్లు చెప్తున్నారు.
Black Chicken- ఈ కోడి చర్మమే కాదు, ముక్కు, గోళ్లు, ఎముకలు చివరికి ఈ కోడి నాలుక కూడా నలుపే. ఈ కోడి శరీరంలో మెలనిన్ ఎక్కువగా ఉండటం వల్ల దానికి ఆ రంగు వచ్చింది. ఈ రకం కోళ్లలో ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి, అంతేకాకుండా కొవ్వు, కొలస్టెరాల్ శాతం తక్కువగా ఉండటం వల్ల దీని మాంసంతో ఉబకాయం కూడా రాదు. ఈ కోడి మాంసంలో ఔషధ గుణాలు కూడా ఎక్కువే.
ఈ కోడి మాంసం తినడం ద్వారా ఇందులో ఉండే పోషకాలు రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెంచడమే కాకుండా, శ్వాససంబంధమైన ఆస్తమా లాంటి రోగాలను నియంత్రణలో ఉంచుతుందంట. గర్భినీలకు ప్రసవం సమయంలో కలిగే కొన్ని సమస్యలను ఇది దూరం చేయడం అలాగే మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో తోడ్పడతాయని కొంత మంది న్యూట్రిషన్లు వారి రీసెర్చిలో భాగంగా వెల్లడించారు.
ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాధాన్యమిచ్చే వారు, బరువును నియంత్రణలో ఉంచుకోవాలని ఆలోచన ఉన్నవారు, ఇంకొంత మంది హృద్రోగ సమస్యలున్న వారు ఈ కోడి మాంసానికి విపరీతమైన ప్రాధాన్యమిస్తున్నరట.
ఓకే... ఇప్పుడు ఇదంతా తెలిసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఛ.. ఈ భూమి మీద ఇంత బ్రతుకు బ్రతికి ఏం లేభం, ఎప్పుడూ, ఎక్కడా, ఏనాడు వీటిని తినలేదు అనిపిస్తుందా? ఆలస్యం ఎందుకు మన దగ్గర కూడా ఇప్పుడు ఈ కోళ్ళను పెంచుతున్నారు. హైదరాబాద్ లోని కొన్ని రెస్టారెంట్లలో కూడా వీటిని వండి వేడివేడిగా వడ్డిస్తున్నారు. మన దగ్గర కడక్‌నాథ్ (Kadaknath Chicken) పేరుతో పిలిచే ఈ కోళ్ళు పొరుగు రాష్ట్రమైన మధ్యప్రదేశ్ లోని ఝబువా మన్యం ప్రాంతంలో కొన్ని గిరిజన జాతులు వీటిని ఎప్పట్నుంచో సాగు చేస్తున్నారు. దీని ధర సీజన్ ను బట్టి కేజీకి రూ. 900 నుంచి రూ. 1,200 వరకు ఉంటుంది.
.