Leg-cramps

కాళ్లను కూడా జాగ్రత్తగా చూసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే కాళ్ల ఆరోగ్యం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. మీ కాళ్ళలో పాదాలలో ఇటువంటి రకాల సమస్యలు కనిపిస్తే మీకు కొన్ని వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం.

కాళ్లలో వాపు: చాలామంది కాళ్ల వాపుతో బాధపడుతుంటారు. ఇది సాధారణ సమస్య అని అందరూ అనుకుంటారు. అయితే ఒక్కొక్కసారి ఇది తీవ్రమైన అనారోగ్య సమస్యకు సంకేతంగా కూడా మనం చెప్పవచ్చు. క్రమక్రమంగా కాళ్లు పాదాలు ఉబ్బుతూ ఉంటే మూత్రపిండాల వ్యాధి, రక్త పోటు, కాలేయం వ్యాధి ఉన్నట్లుగా మనం సంకేతంగా గుర్తించవచ్చు. ఈ సమస్యను మనం నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యుల్ని సంప్రదించడం ఉత్తమం.

కాళ్లు చల్లగా ఉండడం: కొంతమందిలో కాళ్లు పాదాలు స్పృహ లేనట్టుగా చల్లగా అనిపిస్తూ ఉంటాయి. అప్పుడు దానికి సంకేతం ఏంటంటే రక్తం తక్కువగా ఉండడం విటమిన్ లోపంతో బాధపడడం వంటివి కారణం కావచ్చు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి విటమిన్ బి12 లోపం వల్ల చల్లటి పాదాలు అనే అనే సమస్యను ఎదుర్కొంటారు.

Health Tips: బొప్పాయి పండు లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..

వెరికోస్ వీన్స్: ఇవి మన కాళ్లలో సీరియల్ ఆకుపచ్చ రంగుల మీద ఎరుపు రంగులో బయటకు వచ్చినట్లుగా ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. ఇది ముఖ్యంగా అధిక రక్తపోటుకి సంకేతంగా చెప్పవచ్చు. చిన్న వయసులోనే గర్భధారణ తరచుగా గర్భధారణ సమయంలో లేదా గర్భనిరోధక మాత్రలు తీసుకునే స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ లక్షణం మీకు అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

పగిలిన మడమలు: పాదాల పగుళ్లు అందరిలో కనిపించే సమస్య అయితే ఇది సాధారణ సమస్య అయినప్పటికీ కూడా విటమిన్ బి 12 లోపం వల్ల ఈ పాదాల పగుళ్ అనేది వస్తుంది. మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇది మధుమేహం యొక్క సంకేతం కూడా చెప్పవచ్చు.

కాళ్లలో తిమ్మిరి: కొంతమందిలో విటమిన్లు తక్కువగా ఉండడం రక్తహీనత వీన్స్ లో ఒత్తిడిగా ఉండడం వల్ల కాళ్లలో తిమ్మిర్లు ఏర్పడతాయి. ఇది ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవారికి విటమిన్ బి12 ఉన్నవారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీరు ఎప్పుడు కూడా కాళ్ళను తిమ్మిరి అనుభూతిని పొందుతూ ఉంటారు.

ఎలా తగ్గించుకోవాలి: ఈ సమస్యతో బాధపడేవారు ముందుగా జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అదే విధంగా పాదాల్లో చిన్న సమస్య వచ్చినప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. మంచి ఆరోగ్యం కాపాడుకోవడానికి పోషకాహారాలు తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వాటర్ ఎక్కువగా తీసుకోవాలి సాల్ట్ జంక్ ఫుడ్ ఇవన్నీటిని కూడా తగ్గించాలి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.