Intermittent Fasting Linked To Risk Of Death: అడపాదడపా మనం ఉండే ఉపవాసం భద్రతతో పాటు, ఆహారాన్ని నిర్దిష్ట సమయాలకు పరిమితం చేయడం ద్వారా బరువు తగ్గడానికి ఒక ప్రసిద్ధ వ్యూహంగా చెప్పవచ్చు. అయితే వైద్య సమావేశంలో సమర్పించబడిన పరిశోధన నుండి ఆశ్చర్యకరమైన అన్వేషణ దీనిని ప్రశ్నార్థకం చేసింది.
చికాగోలో సోమవారం విడుదల చేసిన అధ్యయనంలో, భోజన సమయాలను రోజుకు కేవలం ఎనిమిది గంటల వ్యవధికి పరిమితం చేయడం వల్ల గుండె జబ్బుల వల్ల మరణించే ప్రమాదం 91% పెరుగుతుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ దీనికి సంబంధించిన ఒక సారాంశాన్ని మాత్రమే ప్రచురించింది, దీనితో శాస్త్రవేత్తలు స్టడీ ప్రోటోకాల్ వివరాల గురించి ఊహాగానాలు చేశారు. AHA ప్రకారం అధ్యయనం విడుదలకు ముందు ఇతర నిపుణులచే సమీక్షించబడింది.
బరువు తగ్గడానికి ఉద్దేశించిన జీవనశైలి జోక్యాలు పరిశీలనలో ఉన్నాయి, ఎందుకంటే కొత్త తరం మందులు ప్రజలకు పౌండ్లను తగ్గించడంలో సహాయపడతాయి. కొంతమంది వైద్యులు ఈ అధ్యయనం యొక్క ఫలితాలను ప్రశ్నించారు. ఈ అధ్యయనం 2003 నుండి 2019 వరకు మరణాల డేటాతో పాటు ప్రశ్నాపత్రాలకు సమాధానాలను పరిశీలించింది. ఈ 30 రకాల జంక్ ఫుడ్స్ సిగరెట్ కన్నా ప్రమాదకరమైనవి, వెంటనే తినడం ఆపేయాలని హెచ్చరిస్తున్న ఆరోగ్య నిపుణులు
ఈ అధ్యయనం ప్రకారం.. రోజులో 8 గంటలు మాత్రమే ఆహారం తీసుకుంటూ.. మిగతా 16 గంటలు ఏమీ తీసుకోని వారు హృదయ సంబంధిత వ్యాధులతో చనిపోయే ప్రమాదం (Intermittent Fasting Linked To Risk Of Death) ఎక్కువగా ఉన్నట్టు తేలింది. నిన్నటి నుంచి ఈ నెల 21 వరకు నాలుగు రోజులపాటు షికాగోలో జరగనున్న అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌కు చెందిన ఎడిడెమియాలజీ అండ్ ప్రివెన్షన్/ లైఫ్ స్టైల్ అండ్ కార్డియోమెటబాలిక్ సైంటిఫిక్ సెషన్స్ 2024లో సమర్పించిన ప్రాథమిక పరిశోధన వివరాలు వెల్లడించాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే..ఈ 7 సూపర్ ఫుడ్స్ హార్ట్ బ్లాక్‌ను నివారించడంలో సహాయపడతాయి
ఆరోగ్యంపై శ్రద్ధచూపే కొందరు నిర్దిష్ట సమయంలో మాత్రమే ఆహారం తీసుకుంటారు. అంటే రోజులో 8 గంటల్లోనే ఆహారాన్ని తీసుకోవడం ముగిస్తారు. అంటే మిగతా 16 గంటలు కడుపును ఖాళీగా ఉంచుతారు. వీరు 16:8 పద్ధతిని అనుసరించి ఆహారం తీసుకుంటారు. అంటే 8 గంటల విండోను కేటాయించుకుని ఆ ప్రకారమే ఆహారం తీసుకుంటారు. మిగిలిన సమయంలో పూర్తిగా ఉపవాసం ఉంటారు. ఇలా చేయడం వల్ల రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ స్థాయులు వంటి అనేక కార్డియోమెటబాలిక్ ఆరోగ్య చర్యలు మెరుగవుతాయని గత అధ్యయనం పేర్కొంది.
రోజుకు 8 గంటల వంటి ఆహార నియమాలు పాటించడం వల్ల బరువు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం మెరుగవుతుందన్నది చాలామంది భావన. తాజా అధ్యయనంలో మాత్రం గుండెకు సంబంధించిన షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. 20 వేలమందిపై జరిపిన అధ్యయనంలో 8 గంటల సమయ నియంత్రిత ఆహారం తీసుకొనే వారిలో హృదయ సంబంధిత మరణాల ముప్పు 91 శాతం ఉన్నట్టు వెల్లడైంది. గుండె జబ్బులు, కేన్సర్ వంటి వాటితో బాధపడే వ్యక్తుల్లో గుండె సంబంధిత మరణాలు సంభవిస్తాయని తేలింది.
ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడుతూ 8 గంటల ఆహార నియమం పాటిస్తే వారిలో గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి వాటితో మరణించే ముప్పు 10 గంటల ఆహార నియమం పాటించే వారితో పోలిస్తే 66 శాతం ఎక్కువ. ఏది ఏమైనా సమయ నియంత్రిత ఆహారం మరణముప్పును ఏమాత్రం తగ్గించలేదని అధ్యయనం తేల్చింది. 16 గంటల ఆహార నియమం పాటించే కేన్సర్ బాధితుల్లో మరణాల ముప్పు గణనీయంగా తగ్గింది. సమయ నియంత్రిత ఆహారంపై కఠిన వాస్తవాలు వెల్లడైనప్పటికీ దీనిపై మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.