Credits: Istock

చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా పడిపోతున్నాయి. పొద్దు పొద్దునే పొగమంచు బాగా కురుస్తుంది. సాయంత్రం నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు చల్లగాలి వీస్తుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. చాలా మంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఉదయానే వాకింగ్, జాగింగ్ చేస్తుంటారు. అయితే చలికాలంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్య సూత్రాలు పాటించకపోతే రోగాల బారినపడతారని వైద్యులు చెప్తున్నారు.రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారు తొందరగా జబ్బుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని.. కనుక సరైన పౌష్టికాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

చలికాలంలో చల్లని వాతావరణంతో ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. పరిసరాలు ఆహ్లదకరంగా ఉంటాయి. ఈ చలికాలంలో ఆహ్లదం పేరుతో జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు చలికాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెప్తున్నారు. రోజు రోజుకు పెరిగిపోతున్న చలి తీవ్రతతో శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. చలికాలంలో వృద్ధులు, చిన్నారులు బయట ఎక్కువ తిరగకపోవటం మంచిదని.. తప్పనిసరైతేనే బయటకు రావాలని.. తలకు మఫ్లర్, మంకీ టోపీలు, ముఖానికి మాస్కులు ధరించి బయటకు రావటం ఉత్తమం అని చెప్తున్నారు.

ఈ క్రమంలో వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో చుట్టుపక్కల ఉన్న పరిసరాల శుభ్రత చాలా ముఖ్యమని.. పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో దోమలు వ్యాప్తిచెంది టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా, మొదడువాపు, విషపూరితమైన జ్వరాల బారిన పడే ప్రమాదం ఉంటుందన్నారు. ముఖ్యంగా తాగునీటి విషయంలో ప్రజలు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని కోరారు. కలుషితమైన నీరు తాగడం వల్ల డయేరియా వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉందని తెల్పుతున్నారు. ఈ చల్లగాలి ద్వారా స్వైన్ ప్లూ వంటి ప్రమాదకరమైన వ్యాధులు సోకే అవకాశాలు ఉంటాయని తెలిపారు.సాదారణంగా మనిషిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఎక్కువ జబ్బుల బారినపడే అవకాశం ఉంటుంది. కనుక పౌష్టికాహారం, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచించారు.

చలికాలంలో ప్రతి ఒక్కరూ సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, అస్తమా రోగులు, వీళ్లందరూ చల్లగాలిలో మంచు పట్టిన సమయంలో బయట తిరగటం మంచిది కాదు. చలికాలంలో ముఖ్యంగా ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు వాడటం బాగా తగ్గించాలి. చర్మంపై అశ్రద్ద వహించకుండా జాగ్రత్తలు పాటించాలి. చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వచ్చిన సమయంలో ఉపశమనం కోసం సొంత వైద్యం మానుకోవాలి.