Bengaluru, Feb 13: ఆసియాలోనే (Asia) అతిపెద్ద ఏరో షో 'ఏరో ఇండియా 2023'ను (Aero india 2023) ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈరోజు బెంగళూరులో ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో 98 దేశాల నుండి 809 కంపెనీలు పాల్గొన్నాయి. వివిధ భారతీయ మరియు విదేశీ రక్షణ సంస్థల మధ్య ₹ 75,000 కోట్ల పెట్టుబడుల అంచనాతో ఈ షోలో 251 ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది.
తెలంగాణలోని స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటన.. ఎప్పటి నుంచి అంటే..?
ఈ కార్యక్రమంలో 32 దేశాల రక్షణ మంత్రులు, 73 మంది వివిధ సంస్థల సీఈఓలు పాల్గొననున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ (USAF) ప్రముఖ యుద్ధ విమానాలలో ఒకటైన F-16 ఫైటింగ్ ఫాల్కన్ ద్వయం రోజువారీ వైమానిక ప్రదర్శనలను నిర్వహించనుంది. చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీ నేతృత్వంలో జరిగిన గురుకుల్ విన్యాసాలు (విమాన విన్యాసాలు) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఎయిర్ షో నేటి నుండి 17 తేదీ వరకు నిర్వహించనున్నారు.
పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే ఆ రాష్ట్రంలో జీవిత ఖైదే... ఆస్తులు కూడా స్వాధీనం.. ఇంతకీ ఎక్కడ??
#WATCH | Chief of the Air Staff Air Chief Marshal VR Chaudhari leads the Gurukul formation during the flypast at the inaugural ceremony of #AeroIndia2023 in Bengaluru, Karnataka. pic.twitter.com/kenaR0er69
— ANI (@ANI) February 13, 2023