Newdelhi, Feb 13: పోటీ పరీక్షలు, నియామకాల్లో పేపర్ లీక్ (Paper Leak) కేసులు, స్కామ్ లు (Scams) ఎక్కువగా నమోదవుతుండడం పట్ల ఉత్తరాఖండ్ (Uttarakhand) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారికి జీవితఖైదు (Life Imprisonment) తప్పదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హెచ్చరించారు. కనీసం 10 సంవత్సరాలకు తగ్గకుండా శిక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇలాంటి కేసుల్లో పట్టుబడినవారికి జైలు శిక్షలే కాకుండా, వారి ఆస్తులు కూడా స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురాగా, గవర్నర్ ఆమోదం కూడా లభించింది.
"Life Imprisonment" For Anyone Caught Cheating In Exams In Uttarakhand https://t.co/rAGqJf4qs1 pic.twitter.com/NLIanDGfbv
— NDTV News feed (@ndtvfeed) February 12, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)