వైరల్

Rohit Sharma: విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ రికార్డును సమం చేసిన రోహిత్‌ శర్మ, ఇంతకీ ఏ రికార్డో తెలుసా ?

Vikas M

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ... క్రిస్‌ గేల్‌ రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యధిక​ సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో గేల్‌, రోహిత్‌ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వన్డేల్లో ఈ ఇద్దరు చెరో 331 సిక్సర్లు బాదారు. ఈ జాబితాలో పాక్‌ మాజీ ఆటగాడు షాహిద్‌ అఫ్రిది (351) టాప్‌లో ఉన్నాడు. రోహిత్‌ తర్వాతి స్థానంలో జోస్‌ బట్లర్‌ ఉన్నాడు

Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, విద్యార్థినులతో ఇంగ్లీష్ టీచర్ అసభ్యకర ప్రవర్తన, చెప్పులతో చితకబాదిన తల్లితండ్రులు

Hazarath Reddy

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి మోడల్ స్కూల్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠాలు చెప్పాల్సిన మాస్టర్ అడ్డదారి తొక్కాడు. స్కూలులో పనిచేసే ఇంగ్లీష్ టీచర్ విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై మండిపడిన తల్లిదండ్రులు అతగాడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. చెప్పులతో ఎడాపెడా వాయించి పడేశారు.

Bihar Shocker: వీడియో ఇదిగో, యూట్యూబ్‌లో చూసి బాంబులు తయారు చేసిన పిల్లలు, ఒక్కసారిగా అవి పేలడంతో గాయాలపాలై ఆస్పత్రిపాలు..

Hazarath Reddy

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని గైఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్నీ బాంగ్రా కళ్యాణ్ గ్రామంలో యూట్యూబ్ వీడియోను చూసి బాంబు తయారీకి ప్రయత్నించిన ఐదుగురు చిన్నారులు గాయపడిన దారుణ ఘటన చోటుచేసుకుంది

Ola: క్విక్‌ కామర్స్‌ వ్యాపారంలోకి మళ్లీ ఓలా రీ ఎంట్రీ, డార్క్‌స్టోర్స్‌ ఏర్పాట్లు చేసుకునే పనిలో పడిన రైడ్ దిగ్గజం, ఈ సంస్థలకు గట్టి పోటీనిచ్చే అవకాశం

Vikas M

గతంలో క్విక్‌ కామర్స్‌ (quick commerce) విభాగంలో అడుగపెట్టి అర్ధంతరంగా వైదొలగిన ఓలా తాజాగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది. మరోసారి రీఎంట్రీ ఇచ్చేందుకు సమాయత్తం అవుతోంది. ఇందుకోసం సొంతంగా డార్క్‌ స్టోర్లను (చిన్నపాటి గోదాములు) ఏర్పాటు చేయాలని ఓలా మాతృ సంస్థ ఏఎన్‌ఐ టెక్నాలజీస్‌ భావిస్తున్నట్లు సమాచారం.

Advertisement

IOA On Antim Panghal: భారత మహిళా రెజ్లర్ అంతిమ్ పంగల్‌పై మూడేళ్ల నిషేధం, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఐఓఏ చర్య

Arun Charagonda

భారత మహిళా రెజ్లర్ అంతిమ్ పంగల్‌పై మూడేళ్ల నిషేధం విధించింది ఇండియన్ ఒలింపిక్ సంఘం.తన అక్రిడిటేషన్ సోదరికి ఇచ్చి ఒలింపిక్‌ గ్రామానికి పంపింది. ఒలింపిక్స్‌లో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన పంగల్‌పై మూడేళ్ల నిషేధం విధించింది ఐఓఏ

Helicopter Crash in Nepal: నేపాల్‌లో మరో హెలికాప్టర్ ప్రమాదం, సువాకోట్ సమీపంలో కుప్పకూలిన విమానం, 5 మంది చైనీయులు మృతి

Hazarath Reddy

నేపాల్ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల జరిగిన ప్రమాదం మరువకముందే తాజాగా మరో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. నేపాల్ రాజధాని ఖాట్మండు నుండి సియాఫ్రుబెన్సి కి వెళుతున్న ఓ హెలికాఫ్టర్ సువాకోట్ సమీపంలో కుప్పకూలింది.

Dog Attack in Karimnagar: షాకింగ్ వీడియో, ఆడుకుంటున్న 18 నెలల బాలుడుపై వీధి కుక్క దాడి, తృటిలో తప్పించుకున్న మరో బాలుడు

Hazarath Reddy

కరీంనగర్ జిల్లాలో పద్దెనిమిది నెలల బాలుడుపై వీధీ కుక్క దాడి చేసింది. శాతావాహన యూనివర్సిటీ సమీపంలోని విద్యానగర్ వీధీలో రోడ్డుపై ఆడుకుంటున్న హరినందన్ అనే చిన్న పిల్లాడిపై‌ వీధి కుక్క దాడి చేసింది. ఇద్దరు అబ్బాయిలు ఆడుకుంటుండగా ఎక్కడనుంచి వచ్చిందో అకస్మాత్తుగా నల్ల కుక్క దూసుకొచ్చింది

Andhra Pradesh: వీడియో ఇదిగో, పల్నాడు జిల్లాలో వైసీపీ కార్యకర్త కిడ్నాప్, బొలెరో వాహనంలో కత్తులతో వచ్చి మరీ..

Hazarath Reddy

పల్నాడుజిల్లాలోని బొల్లాపల్లి మండలం వెంకుపాలెంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజును గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆటోలో కూరగాయలు అమ్ముకుంటున్న నాగరాజును బొలెరో వాహనంతో అడ్డుకుని.. బలవంతంగా ప్రత్యర్థులు తీసుకెళ్లారు. ఆటోను అడ్డగించి నాగరాజు కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు.

Advertisement

Bitthiri Satthi: భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశాడన్న ఆరోపణలపై స్పందించిన బిత్తిరి సత్తి (వీడియో)

Rudra

భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశాడన్న ఆరోపణలపై బిత్తిరి సత్తి స్పందించారు. తాను సరదాగా చేసిన వీడియోని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.

Shyam Prasad Reddy: ప్రముఖ నిర్మాత శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి ఇంట విషాదం.. సతీమణి వరలక్ష్మి కన్నుమూత

Rudra

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, మల్లెమాల ఎంటర్‌ టైన్స్‌ మెంట్‌ ప్రొడక్షన్స్ అధినేత శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి (Shyam Prasad Reddy) ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సతీమణి వరలక్ష్మి కన్నుమూశారు.

Mobile Connections: దేశవ్యాప్తంగా 73 లక్ష‌ల మొబైల్ క‌నెక్ష‌న్లు ర‌ద్దు.. కార‌ణం ఏమిటంటే?

Rudra

దేశవ్యాప్తంగా 81 లక్షల అనుమానిత మొబైల్ కనెక్షన్‌లను గుర్తించామని అందులో 73 ల‌క్ష‌ల మొబైల్ క‌నెక్ష‌న్ల‌ను టెలికం కంపెనీలు ర‌ద్దు చేసినట్టు బుధ‌వారం లోక్‌ స‌భ‌లో కేంద్రం తెలిపింది.

Six Continents: ఖండాలు ఏడు అని పుస్తకాల్లో చదువుకున్నాం కదూ.. అయితే, అవి ఏడు కాదు ఆరే.. ఉత్తర అమెరికా, యూరప్‌ ఇంకా విడిపోలేదట.. ఎలాగంటే?

Rudra

ప్రపంచంలో మొత్తం ఎన్ని ఖండాలున్నాయి? ఏడే కదా! చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో కూడా అదే చదువుకున్నాం కదా అంటారా? అది నిజమే! అయితే, ఇప్పటివరకూ ఆఫ్రికా, అంటార్కిటికా, ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్‌, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా అని మొత్తం ఏడు ఖండాలు ఉన్నట్టు మనం చదువుకున్న విషయంలో నిజం లేదట.

Advertisement

Zero Salary, No Weekend Offs: జీతం ఇయ్యం.. సెలవులు ఉండవు. ఆదివారం కూడా పనిచెయ్యాలే.. ఇంటర్నెట్ ను కుదిపేస్తున్న గుజరాత్ కంపెనీ జాబ్ ఆఫర్

Rudra

ఆర్ధిక మాంద్యం భయాలు ఉన్నాయి. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇది నిజమే. అయితే, జీతం ఇయ్యం, సెలవులు ఉండవు. ఆదివారం కూడా ఆఫీసుకు రావాల్సిందే అని కండిషన్స్ పెడితే, ఎవరు ఆ కొలువులో చేరుతారు? అయినా, ఇలా ఏ కంపెనీ అయినా ఇలా ప్రకటన ఇస్తుందా? అనుకుంటున్నారా? నిజమండీ..

Vinesh Phogat Retires: ‘నాపై రెజ్లింగ్‌ గెలిచింది.. నేను ఓడిపోయా..’ కుస్తీకి వినేశ్‌ ఫోగాట్‌ గుడ్‌ బై.. సిల్వర్ మెడల్ పై తీర్పు రాకముందే సంచలన నిర్ణయం తీసుకున్న భారత స్టార్‌ రెజ్లర్‌

Rudra

భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్‌ రెజ్లింగ్‌ కు రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. ‘కుస్తీ నాపై గెలిచింది.. నేను ఓడిపోయా’ అంటూ భావోద్వేగంతో ఆమె ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

Caught On Camera: వీడియో ఇదిగో, పోలీస్ స్టేషన్‌లో పోలీసుల ముందే మహిళను దారుణంగా కొట్టిన బీజేపీ నేత

Vikas M

బుల్దానా జిల్లాలోని మల్కాపూర్ వద్ద శివ టైడే అనే బీజేపీ నేత ఒక రౌడీతో కలిసి ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే మహిళ మీద విచక్షణారహితంగా దాడి చేశాడు. బుల్దానాలో జరిగిన ఒక షాకింగ్ సంఘటనలో, స్థానిక బిజెపి నాయకుడు అతన్ని అడ్డుకోవడానికి పోలీసులు జోక్యం చేసుకునే వరకు నగర పోలీసు స్టేషన్‌లో ఒక మహిళను కొట్టారు

Olympic Games Paris 2024: ఒలింపిక్స్ పతకాల పట్టికలో చైనాను వెనక్కి నెట్టేసిన అమెరికా, 63 స్థానంలో భారత్, పారిస్ 2024 ఒలింపిక్స్ మెడల్ టాలీ ఇదిగో..

Vikas M

బుధవారం నాటి పారిస్ ఒలింపిక్స్ పతకాల పట్టికలో అమెరికా 25 స్వర్ణాలను సాధించి చైనాను అధిగమించి అగ్రస్థానంలో ఉంది. 2024 పారిస్ గేమ్స్‌లో 12వ రోజు కంటే ముందు చైనా 23 బంగారు పతకాలతో రెండవ స్థానంలో ఉంది.

Advertisement

Vinesh Phogat Disqualification: ఎవరైనా రూల్స్‌ను గౌరవించాల్సిందే, వినేశ్‌ కోసం రూల్స్‌ మార్చలేమని తెలిపిన యూడబ్ల్యూడబ్ల్యూ అధ్యక్షుడు లలోవిక్‌

Vikas M

పారిస్‌ ఒలింపిక్స్‌ మహిళల 50 కేజీల ఫ్రీస్టయిల్‌ రెజ్లింగ్‌ పోటీల్లో భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ అనర్హత వేటుకు గురైన విషయం తెలిసిందే. వినేశ్‌ అనర్హత నేపథ్యంలో యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW) అధ్యక్షుడు నెనాద్ లాలోవిక్ స్పందించాడు. 100 గ్రాముల అధిక బరువు ఉన్న కారణంగా వినేశ్‌పై అనర్హత వేటు పడటం బాధాకరమని అన్నాడు. వినేశ్‌ రాత్రికిరాత్రి బరువు పెరిగిందని తెలిపాడు.

Independence Day Speech In Telugu: స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం ఇదిగో, ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యార్థుల కోసం స్వాతంత్య్ర దినోత్సవ స్పీచ్

Vikas M

ప్రస్తుతం, దేశంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవం కోసం సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల్లో స్వాతంత్ర్య దినోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలు ఒక వారం ముందుగానే ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు సాంస్కృతిక నృత్యాలు, పాటలు, నాటికలు మొదలైన వాటిని ప్రదర్శిస్తారు.

Rahul Gandhi on Vinesh Phogat Disqualification: దేశం మొత్తం మీ వెంటే ఉంది వినేశ్, రాహుల్ గాంధీ ట్వీట్ ఇదిగో, నువ్వు ఎప్పుడూ దేశం గర్వించేలా చేశావంటూ విషెస్

Hazarath Reddy

ప్రపంచ ఛాంపియన్ రెజ్లర్లను ఓడించి ఫైనల్స్‌కు చేరిన భారత్‌కు గర్వకారణమైన వినేష్ ఫోగట్ సాంకేతిక కారణాలతో అనర్హత వేటు పడటం దురదృష్టకరం.ఈ నిర్ణయాన్ని భారత ఒలింపిక్ సంఘం గట్టిగా సవాలు చేస్తుందని, దేశ పుత్రికకు న్యాయం చేస్తుందని మేము పూర్తి ఆశిస్తున్నాము

Anthony Ammirati: గంట నటిస్తే రెండున్న‌ర ల‌క్ష‌ల డాల‌ర్లు, పురుషాంగం దెబ్బకి ఒలింపిక్స్‌లో డిస్ క్వాలిఫై అయిన ఫ్రెంచ్ పోల్‌వాల్ట్ అథ్లెట్‌కు పోర్న్ సైట్ భారీ ఆఫ‌ర్‌

Hazarath Reddy

ఫ్రాన్స్ పోల్‌వాల్ట్(pole vaulter) ఆట‌గాడు ఆంథోనీ అమ్మిరాటికి .. ఓ పోర్న్ సైట్ కంపెనీ బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది.ఒక‌వేళ అమ్మిరాటి పోర్న్ సైట్‌లో న‌టిస్తే, అత‌నికి రెండున్న‌ర ల‌క్ష‌ల డాల‌ర్లు ఇవ్వ‌నున్న‌ట్లు కామ్‌సోడా వెబ్‌సైట్ ప్ర‌క‌ట‌న చేసింది.వెబ్‌కామ్ షోకు 60 నిమిషాల స‌మ‌యం కేటాయిస్తే, రెండున్న‌ర ల‌క్ష‌ల డాల‌ర్లు ఇవ్వ‌నున్న‌ట్లు కామ్‌సోడా సీఈవో డార్ని పార్క‌ర్ తెలిపారు.

Advertisement
Advertisement