Viral

Sridevi Death Case: అలనాటి హీరోయిన్ శ్రీదేవీ మృతి కేసు మళ్లీ తెరపైకి, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన మహిళపై ఛార్జిషీట్‌ దాఖలు చేసిన సీబీఐ

Hazarath Reddy

అలనాటి అందాల తార శ్రీదేవి (Sridevi) మృతిపై నకిలీ పత్రాలు సృష్టించిన ఓ యూట్యూబర్‌పై సీబీఐ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. శ్రీదేవి మరణంపై తాను సొంతంగా విచారణ జరిపానని, యూఏఈ-భారత్‌ ప్రభుత్వాలు నిజాలను దాచినట్టు తేలిందంటూ నకిలీ పత్రాలు సృష్టించిన భువనేశ్వర్‌కు చెందిన దీప్తి పిన్నిటిపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. ఫిర్యాదులో దీప్తి న్యాయవాది భరత్‌ సురేశ్‌ను కూడా చేర్చారు.

Frontdesk Layoffs: ఆగని లేఆప్స్, కంపెనీలో ఉన్న మొత్తం 200 మంది ఉద్యోగుల్ని తీసేసిన టెక్ దిగ్గజం ఫ్రంట్‌డెస్క్‌, జనవరి నెలలో 30,000కు పైగా ఉద్యోగులు రోడ్డు మీదకు

Hazarath Reddy

అమెరికాకు చెందిన టెక్‌ కంపెనీ ‘ఫ్రంట్‌డెస్క్‌’ సీఈవో.. కేవలం రెండు నిమిషాల గూగుల్‌మీట్‌ కాల్‌తో కంపెనీలోని మొత్తం 200మంది ఉద్యోగులను తొలగించారు.దివాలా తీసిన కంపెనీగా ముద్ర పడకుండా కంపెనీ యాజమాన్యం ఈ చర్యను చేపట్టినట్టు తెలిసింది.

Punjab: మద్యం మత్తులో పోలీస్ అధికారి దారుణం, గురుద్వారాలోకి ప్రవేశించి వాలంటీర్లపై దాడి, సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

పంజాబ్‌లోని మాన్సాలో ఒక సీనియర్ పోలీసు అధికారి మద్యం మత్తులో గురుద్వారాలోకి ప్రవేశించి అక్కడి వాలంటీర్లపై దాడి చేశారనే ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేశారు. బోహాలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) మరొక వ్యక్తితో గురుద్వారా గోడను స్కేలింగ్ చేస్తూ వీడియోలో పట్టుబడ్డాడు

Monkey Fever in Karnataka: కర్ణాటకను వణికిస్తున్న మంకీ ఫీవర్‌, ఇద్దరు మృతి, తాజాగా 47 కొత్త కేసులు, కోతులను కరిచే కీటకాలు మనిషిని కరవడం వల్ల వ్యాధి

Hazarath Reddy

కర్ణాటక రాష్ట్రంలో మంకీ ఫీవర్‌తో (Monkey Fever in Karnataka) ఇద్దరు మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు చేపట్టవలసిన చర్యలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Advertisement

Accident Caught on Camera: షాకింగ్ రోడ్డు యాక్సిడెంట్ వీడియో ఇదిగో, బైకును ఢీకొట్టి 50 మీట్లరు ఈడ్చుకెళ్లిన ఎస్‌యూవీ, ఒకరు మృతి

Hazarath Reddy

తమిళనాడులోని కాంచీపురంలో అతివేగంగా వెళ్తున్న ఎస్‌యూవీ.. ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో 44 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. బాలమురుగన్ అనే వ్యక్తి తన స్నేహితుడు రమేష్‌తో కలిసి రైడింగ్ చేస్తున్నప్పుడు అయ్యంగార్ కలాం ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.

Andhra Pradesh: శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు పూజలో పాల్గొన్న 30 మంది రష్యన్ భక్తులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలోని శ్రీకాళహస్తి ఆలయంలో జరిగిన సాంస్కృతిక పూజా కార్యక్రమంలో, ఫిబ్రవరి 5, సోమవారం నాడు 30 మంది రష్యన్ భక్తులు పవిత్రమైన రాహుకేతు పూజలో నిమగ్నమయ్యారు. వార్తా సంస్థ ANI ద్వారా భాగస్వామ్యం చేయబడిన ఒక వీడియో రష్యన్ భక్తులను ఆధ్యాత్మికతలో మునిగిపోయి, వాతావరణం ఆలయం యొక్క సమగ్రతను ప్రదర్శిస్తుంది.

Tech Layoffs 2024: టెక్ రంగంలో ఆగని లేఆప్స్, 150 మంది ఉద్యోగులను తొలగించిన జూమ్, 400 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపిన ఆక్టా

Hazarath Reddy

వీడియో కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్ జూమ్ దాదాపు 150 మంది ఉద్యోగులను లేదా కంపెనీ వర్క్‌ఫోర్స్‌లో 2 శాతం కంటే తక్కువ మందిని తొలగిస్తోంది. ఉద్యోగుల తొలగింపులు కంపెనీ వ్యాప్తం కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సేల్స్, ప్రొడక్ట్ మరియు కార్యకలాపాల్లో 2024లో తమ నియామకాలను కొనసాగిస్తామని జూమ్ తెలిపింది.

36 Prisoners Test HIV Positive: లక్నో జైలులో 36 మంది ఖైదీలకు ఎయిడ్స్‌, మొత్తం 47కు చేరిన హెచ్‌ఐవీ బారిన పడిన ఖైదీల సంఖ్య, అప్రమత్తమైన జైలు అధికారులు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌ లక్నో జిల్లా జైలులో మరో 36 మంది ఖైదీలకు ఎయిడ్స్‌ సోకింది. దీంతో (HIV positive prisoners) హెచ్‌ఐవీ పాజిటివ్‌ కేసుల సంఖ్య జైలులో 47కు పెరిగింది.ఎయిడ్స్‌ సోకిన రోగులకు చికిత్సతోపాటు కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు.

Advertisement

Bus Conductor Saves Woman: వేగంగా వెళుతున్న బస్సులో నుంచి కిందపడబోయిన యువతి, జుట్టుపట్టుకుని లోపలికి లాగి కాపాడిన కండక్టర్‌, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లాలో గల ఈరోడ్ నుంచి మెట్టూరు వెళ్తున్న బస్సులో నుంచి ఓ యువతి రోడ్డుపై పడబోయింది.బస్సు ఒక్కసారిగా కుదుపు ఇవ్వగా డోర్‌ వద్ద ఉన్న ఆమె కదులుతున్న బస్సు నుంచి బయటకు పడబోయింది. అప్రమత్తమైన కండక్టర్‌ ఆమె జుట్టుపట్టుకుని బస్సులోనికి లాగాడు

BJP MLA Shoots Video: వీడియో ఇదిగో, పోలీస్టేషన్‌లో శివసేన నేతలపై కాల్పులు జరిపిన బీజేపీ ఎమ్మెల్యే, కాల్పులపై తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని వెల్లడి

Hazarath Reddy

మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ షిండే వర్గం, బీజీపీ వర్గం మధ్య కాల్పులు చోటు చేసుకున్నది. ఉల్హాస్‌నగర్ పోలీస్ స్టేషన్లో శివసేన నేత మహేశ్ గైక్వాడ్‌పై బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్‌ తుపాకితో కాల్పులు జరిపాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహేశ్ గైక్వాడ్‌ని పోలీసులు ఆస్పత్రికి తరలించారు

Yashasvi Jaiswal 200 Video: యశస్వీ జైశ్వాల్‌ తొలి డబుల్ సెంచరీ వీడియో ఇదిగో, భారత్‌ తరపున డ‌బుల్ సెంచ‌రీ బాదిన మూడో అతి పిన్న వయస్కుడిగా రికార్డు

Hazarath Reddy

విశాఖ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. తన కెరీర్‌లో తొలి డబుల్‌ సెంచరీని సాధించాడు. 277 బంతుల్లో 18 ఫోర్లు, 7 సిక్స్‌లతో యశస్వీ తన డబుల్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 290 బంతుల్లో 209 పరుగులు చేసి జైశ్వాల్‌ ఔటయ్యాడు.

IND vs ENG 2nd Test 2024: స్టంప్ ఔట్ మిస్ చేసిన వికెట్ కీపర్ భరత్, కెప్టెన్ రోహిత్ శర్మ రియాక్షన్ ఎలా ఉందో చూడండి..

Hazarath Reddy

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 11 ఓవర్ వేసిన కుల్దీప్‌ యాదవ్‌ రెండో బంతికి డకెట్‌ను ఔట్‌ చేశాడు. అనంతరం పోప్‌ క్రీజులోకి వచ్చాడు. అయితే తన ఎదుర్కొన్న తొలి బంతినే అద్బుతమైన డెలవరీగా కుల్దీప్‌ సంధించాడు. ఆ బంతిని అంచనా వేయడంలో పోప్‌ విఫలమయ్యాడు. బంతి పోప్‌ బ్యాట్‌ను మిస్‌ అయ్యి వికెట్‌ కీపర్‌ చేతికి వేళ్లింది.వికెట్‌ కీపర్‌ భరత్‌ సైతం బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు

Advertisement

Jasprit Bumrah: విశాఖలో రికార్డులతో హోరెత్తించిన భారత స్పీడ్ గన్ జస్‌ప్రీత్‌ బుమ్రా, అతి తక్కువ బంతుల్లోనే 150 వికెట్లు, టెస్టుల్లో పదోసారి ఐదు వికెట్లు హాల్

Hazarath Reddy

ఇంగ్లండ్‌తో రెండో టెస్టు సందర్భంగా టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. వైజాగ్‌ మ్యాచ్‌లో శనివారం నాటి ఆటలో దుమ్మురేపిన ఈ ఫాస్ట్‌బౌలర్‌.. అంతర్జాతీయ టెస్టుల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.

Ben Stokes Dismissal Video: బుమ్రా కట్టర్ దెబ్బకు క్లీన్ బౌల్డ్ అయిన బెయిర్‌ స్టోక్స్ వీడియో ఇదిగో, బ్యాట్ కిందపడి బిత్తర చూపులు చూసిన ఇంగ్లండ్ బ్యాటర్

Hazarath Reddy

ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా జస్‌ప్రీత్‌ బుమ్రా ఇంగ్లిష్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.తొలుత జో రూట్‌(5)ను పెవిలియన్‌కు పంపిన బుమ్రా.. ఆ తర్వాత ఒలీ పోప్‌(23)ను అద్భుతమైన ఇన్‌స్వింగింగ్‌ యార్కర్‌తో క్లీన్ బౌల్డ్‌ చేశాడు.అనంతరం.. బెయిర్‌ స్టోక్స్ ను సంచలన రీతిలో బౌల్డ్‌ చేశాడు

Shreyas Iyer Catch Video: శ్రేయాస్ అయ్యర్ వెనుకకు పరిగెత్తుతూ అందుకున్న అద్భుతమైన క్యాచ్ వీడియో ఇదిగో, భారీ షాట్లతో భారత్ బౌలర్లను హడలెత్తించిన జాక్ క్రాలీని పెవిలియన్‌కు..

Hazarath Reddy

ఫిబ్రవరి 3, శనివారం భారత్ vs ఇంగ్లండ్ 2వ టెస్టు 2024లో 2వ రోజున జాక్ క్రాలీని ఔట్ చేయడానికి శ్రేయాస్ అయ్యర్ సంచలన క్యాచ్‌ పట్టాడే. మంచి ఫామ్‌లో ఉన్న క్రాలీ 78 బంతుల్లో 76 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో అక్సర్ పటేల్‌ బౌలింగ్ లో దాడికి ప్రయత్నించాడు.

Jasprit Bumrah Yorker Video: జస్ప్రీత్‌ బుమ్రా యార్కర్ వీడియో ఇదిగో, ఎగిరి అవతల పడిన వికెట్లు, బిత్తరపోయి అలానే చూస్తుండిపోయిన ఇంగ్లండ్ బ్యాటర్‌ ఓలీ పోప్‌

Hazarath Reddy

యార్కర్ల కింగ్‌, టీమిండియా పేస్‌ గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా మరోసారి అద్భుతమైన యార్కర్ తో మెరిసాడు. వైజాగ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్‌ ఓలీ పోప్‌ను అద్బుతమైన బంతితో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. బుమ్రా వేసిన ఓ డెలివరీకి పోప్‌ వద్ద సమాధానమే లేకుండా పోయింది.

Advertisement

Rajasthan Failed Suicide Pact: పెళ్లైన మగవాడితో యువతి ప్రేమాయణం.సమాజం ఒప్పుకోదని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం, ప్రియుడు ఆత్మహత్యను చూసి భయంతో ప్రియురాలు ఏం చేసిందంటే..

Rudra

పెళ్లైన వ్యక్తితో ప్రేమాయణం సాగించిన యువతి చివరకు అతడి మరణానికే కారణమైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లాలో నివాసం ఉంటున్న రాజుభట్ (34)కు అప్పటికే పెళ్లయింది.

Wild Elephant into Village: దారితప్పి జనావాసాల్లోకి అడవి ఏనుగు.. బంధించి తీసుకెళ్లే పనిలో అటవీ అధికారులు.. (వైరల్ వీడియో)

Rudra

ఓ అడవి ఏనుగు దారితప్పి జనావాసాల్లోకి వచ్చింది. సమీప అటవీ ప్రాంతం నుంచి గ్రామాల్లోకి వచ్చి తిరుగుతోంది. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

Pigeon Probed in Custody: 8 నెలలుగా పోలీస్‌ కస్టడీలో పావురం.. గూఢచర్యంపై దర్యాప్తు.. ఎట్టకేలకు విడుదల

Rudra

ఒక పావురం ఎనిమిది నెలలుగా పోలీస్‌ కస్టడీలో ఉన్నది. గూఢచర్యం ఆరోపణలపై దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు దానిని విడిచిపెట్టారు.

Husband Locks-up Wife for 12 years: పుష్కర కాలంపాటు ఒకే గదిలో భార్యను నిర్బంధించిన భర్త.. భర్తపై ఫిర్యాదు చేయడానికి బాధితురాలు నిరాకరణ.. నిందితుడికి కౌన్సెలింగ్‌ ఇచ్చిన పోలీసులు

Rudra

కర్ణాటకలోని మైసూరులో ఘోరం జరిగింది. నగరానికి చెందిన ఓ వ్యక్తి.. 12 ఏండ్లుగా తన భార్యను ఇంట్లోనే బందీని చేశాడు. రోజూ తాను ఉద్యోగానికి బయటికి వెళ్లేటప్పుడు భార్యను ఇంట్లోనే ఉంచి తాళం వేసుకొని వెళ్లేవాడు.

Advertisement
Advertisement