వైరల్
HYDRA 2.0: హైడ్రా 2.0.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం.. సంగారెడ్డిలో కూల్చివేతలు షురూ.. (వీడియో)
Rudraభూఆక్రమణలు చేసిన అక్రమార్కుల పాలిట ఉక్కుపాదం మోపిన హైడ్రా వెర్షన్ 2.0 ప్రారంభమైనట్టు తెలుస్తున్నది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ఉదయం హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.
Railway Helped Groom: ముహూర్త సమయం ముగిసిపోతున్నది.. వరుడు ఇక్కడ.. పెండ్లి అక్కడ.. దీంతో వరుడి కోసం ఆగిన రైలు.. ఏంటా సంగతి??
Rudraఅనుకోని కారణాల వల్ల ముహూర్త సమయానికి ఓ వరుడు మండపానికి చేరుకోవడంలో ఆలస్యమైంది. దీంతో అతన్ని పెండ్లి వేదికకు చేర్చేందుకు రైల్వే శాఖ ఏకంగా ఓ రైలును ఆలస్యంగా నడిపింది.
AP Cabinet Meeting Postponed: నేడు జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా.. కారణం ఏమిటంటే?
Rudraనేడు జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగనున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి.
New EV Policy in Telangana: తెలంగాణలో కొత్త ఈవీ పాలసీ... 100 శాతం పన్నుతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా మినహాయింపు.. నేటి నుంచే అమల్లోకి..!
Rudraతెలంగాణలో విద్యుత్తు వాహనాలకు సంబంధించి నూతన ఈవీ పాలసీని తీసుకొచ్చారు. ఆ కొత్త ఈవీ పాలసీ నేటి (నవంబరు 18) నుంచే అమల్లోకి వచ్చింది. తాజా ఈవీ పాలసీ ప్రకారం... ఫోర్ వీలర్ ఈవీలు, టూ వీలర్ ఈవీలు, కమర్షియల్ ఈవీలకు 100 శాతం పన్ను మినహాయింపు ఉండనుంది.
Hypersonic Missile: భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం, హైపర్ సోనిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన డీఆర్‌డీఓ...వీడియో
Arun Charagondaఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపం నుండి డీఆర్‌డీఓ క్షిపణి పరీక్షను విజయవంతంగా ప్రయోగించింది. దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించి... హైపర్ సోనిక్ క్షిపణులున్న అతికొద్ది దేశాల జాబితాలో భారత్ చేరింది.
Miss Universe 2024: విశ్వసుందరిగా నిలిచిన డెన్మార్క్ బ్యూటీ కెజార హెల్విగ్, రన్నరప్‌గా నిలిచిన చిడిమ్మ అడెట్షినా..టాప్ 30లో భారత్‌కు చెందిన రియా సింఘా
Arun Charagonda2024 మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకుంది డెన్మార్క్‌కు చెందిన 21 ఏళ్ల విక్టోరియా కెజార హెల్విగ్. మెక్సికో వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో 125 మంది పోటీ పడగా.. విక్టోరియా విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకుంది. నైజీరియాకు చెందిన చిడిమ్మ అడెట్షినా మొదటి రన్నరప్‌గా నిలిచింది.
Viral Video: షాకింగ్ వీడియో...ఓ ఇంట్లో పెంపుడు కుక్కపై చిరుత దాడి...చివరకు ఏం జరిగిందో తెలుసా!
Arun Charagondaరాజస్థాన్‌లోని జైపూర్‌లో చిరుత కలకలం రేపింది. ఓ ఇంట్లో పెంపుడు కుక్కపై చిరుత దాడి చేసింది. కుక్క మెడను నోటితో పట్టుకుని కొరికి చంపేందుకు ప్రయత్నించింది. అయితే చిరుత బారి నుంచి తప్పించుకునేందుకు కుక్క తీవ్రంగా ప్రయత్నించింది. చివరకు యజమానురాలు కేకలు వేస్తూ బయటకు రాగా ఆ కుక్కను వదిలేసి చిరుత పారిపోయింది.
Khammam Shocker: ఖమ్మంలో షాకింగ్ ఘటన...విద్యార్థికి గుండు చేయించిన అసిస్టెంట్ ప్రొఫెసర్.. మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్వాకం..
sajayaఖమ్మం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది కటింగ్ సరిగ్గా చేయించుకోలేదని ఓ విద్యార్థికి అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు చేయించిన ఘటన జిల్లాలో కలకలం లేపింది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మంలోని మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫస్టియర్ విద్యార్థికి గుండు చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
Mike Tyson: లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ఓటమిని తట్టుకోలేక టీవీని బద్దలు కొట్టిన అభిమాని.. అసలేమైంది? (వీడియో)
Rudraప్రపంచ గొప్ప బాక్సర్ లలో ఒకరైన 58 ఏళ్ల మైక్ టైసన్ కు షాక్ తగిలింది. 27 ఏళ్ల బాక్సర్, యూట్యూబర్ జేక్ పాల్ కీలక మ్యాచ్ లో మైక్ ను ఓడించి చరిత్ర సృష్టించాడు.
Lady Aghori: తణుకులో శ్రీశ్రీశ్రీ రాజేష్ నాథ్ జీ (ఉజ్జయిని) అఘోరాని కలిసి ఆశీస్సులు తీసుకున్న లేడీ అఘోరి.. (వీడియో)
Rudraఏపీలోని పలు ఆలయాలను సందర్శిస్తున్న లేడీ అఘోరీ.. తాజాగా తణుకులో శ్రీశ్రీశ్రీ రాజేష్ నాథ్ జీ (ఉజ్జయిని) అఘోరాని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.
Telugu States Weather Update: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీకి నేడు, రేపు వర్ష సూచన.. తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే
Rudraనైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఇంకా కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని కోస్తా, సీమ జిల్లాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
HIV Vaccine: హెచ్‌ఐవీకి త్వరలో టీకా.. హాంకాంగ్ లోని బయోటెక్ స్టార్టప్ కంపెనీ ప్రకటన.. పూర్తి వివరాలు ఇవిగో.. !
Rudraప్రపంచ దేశాలను కలవరానికి గురిచేస్తున్న ఎయిడ్స్ వ్యాధికి దారి తీసే హెచ్‌ఐవీ వైరస్ ను నయం చేసే టీకాను అభివృద్ధి చేసినట్లు హాంకాంగ్ లోని బయోటెక్ స్టార్టప్ కంపెనీ ఇమ్యునో క్యూర్ ప్రకటించింది.
TGPSC Group-3 Exams: తెలంగాణలో నేటి నుంచి గ్రూప్-3 పరీక్షలు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 1,401 పరీక్ష కేంద్రాలు.. హాజరుకానున్న 5,36,395 మంది అభ్యర్థులు
Rudraతెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం గ్రూప్-3 పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) తెలిపింది.
Uttar Pradesh: యూపీ మంత్రిని టార్గెట్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. ఏకంగా రూ. 2.8 కోట్లు కాజేసిన నేరగాళ్లు...పోలీసుల దర్యాప్తు
Arun Charagondaఉత్తర ప్రదేశ్ మంత్రి నంద్ గోపాల్ గుప్తా కుమారుడిని అంటూ అకౌంటెంట్ రితేష్ శ్రీవాస్తవకు సైబర్ నేరగాళ్లు కాల్ చేశారు. నేను బిజినెస్ మీటింగ్ లో ఉన్నాను. నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, త్వరగా పంపండంటూ చెప్పడంతో, అకౌంటెంట్ మూడు ఖాతాల్లో డబ్బులు పంపాడు. తర్వాత ఆ ఖాతాలను చెక్ చేయగా అవి మంత్రి కొడుకువి కాదని తెలిసింది. అకౌంటెంట్ భయపడి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Viral Video: విమానంలో కదలికలు, ఎగిరిపడ్డ ప్రయాణికులు..వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaస్వీడన్‌లోని స్టాక్ హోం నుంచి ఫ్లోరిడాలోని మయామీకి వెళ్తున్న స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు సీట్లలో నుంచి ఎగిరిపడ్డారు. వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పి తిరిగి స్టాక్ హోమ్‌లో దింపేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Viral Video: సింగపూర్‌లో షాకింగ్ రోడ్డు ప్రమాదం, మహిళను గుద్దిన కారు...డ్రైవర్ దిగి వెళ్లి చూసే సరికి ఏం జరిగిందో తెలుసా?
Arun Charagondaసింగపూర్‌లోని ఆర్చర్డ్ రోడ్‌ను ఓ మహిళ ఫోన్‌లో లీనమై దాటుతుండగా కారు మహిళను ఢీకొట్టింది. మహిళ పరిస్థితిని చూడడానికి డ్రైవర్ కారు దిగి వచ్చాడు. ఆ మహిళ లేచి గాయాలను చూడకుండా ఫోన్ పాడైపోయిందో లేదో తనిఖీ చేసింది. కారు డాష్‌బోర్డ్ కెమెరా ఫుటేజ్ వైరల్‌గా మారింది.
Man Forcing Wife to Leave Her Job is Cruelty: ఉద్యోగం మానేయాలని భార్యపై ఒత్తిడి చేయడం క్రూరత్వమే.. మధ్యప్రదేశ్ హైకోర్టు
Rudraఉద్యోగం మానేయాలని, తన ఆకాంక్షలకు అనుగుణంగా బతకాలని భార్యను భర్త వేధించడం, ఒత్తిడి చేయడం.. అలా వినని సందర్భంలో నిర్బంధించడం క్రూరత్వమేనని మధ్యప్రదేశ్ హైకోర్టు చెప్పింది.
Wedding Loans: ఇంటి ఋణం, కారు రుణం గురించే విన్నాం.. ఇది వివాహం రుణం.. మ్యాట్రిమొనీ.కామ్ సంస్థ సరికొత్త సేవలు
Rudraఇంటి రుణం, కారు రుణం గురించే విన్నాం.. వివాహం కోసం రుణం గురించి ఎప్పుడైనా విన్నారా? అయితే, ఈ వార్తా మీకోసమే.. ప్రీవెడ్డింగ్, సంగీత్, హల్దీ, మ్యారేజ్, రిసెప్షన్ అంటూ.. వివాహ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి.
Sex with Minor Wife Amounts to Rape: మైనర్ భార్యతో సెక్స్ రేప్ కిందనే లెక్క.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు
Rudraమైనర్ భార్యతో శృంగారంలో పాల్గొనడం అత్యాచారం కిందకే వస్తుంది. ఈ మేరకు బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ సంచలన తీర్పు చెప్పింది. శృంగారానికి అంగీకారం తెలిపేందుకు కనీస వయసు 18 ఏండ్లు ఉండాలని ఈ సందర్భంగా కోర్టు పేర్కొన్నది.
Bomb Threat to Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు కలకలం.. విమానంలో బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడి హల్ చల్
Rudraశంషాబాద్ విమానాశ్రయంలో బాంబు కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్లాల్సిన విమానం గేటు దగ్గరికి రాగానే బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడు హల్ చల్ సృష్టించాడు.