Whatsapp Map Error: ఇండియా మ్యాప్ ను తప్పుగా చూపెడుతూ వాట్సాప్ న్యూ ఇయర్ వీడియో.. హెచ్చరించిన కేంద్రమంత్రి.. వాట్సాప్ క్షమాపణలు.. వీడియో తొలగింపు

భారత చిత్ర పటాన్ని తప్పుగా చూపించిన మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’పై కేంద్ర ఐటీశాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లో ఉండి వ్యాపారం చేసుకుంటూ ఇదేం పని అని మండిపడ్డారు.

Whatsapp Map Error: ఇండియా మ్యాప్ ను తప్పుగా చూపెడుతూ వాట్సాప్ న్యూ ఇయర్ వీడియో.. హెచ్చరించిన కేంద్రమంత్రి.. వాట్సాప్ క్షమాపణలు.. వీడియో తొలగింపు
Credits: Video Grab

Newdelhi, Jan 1: భారత చిత్ర పటాన్ని (India Map) తప్పుగా చూపించిన మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’పై (Whatsapp)  కేంద్ర ఐటీశాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (Rajeev Chandrasekhar) ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లో ఉండి వ్యాపారం (Business) చేసుకుంటూ ఇదేం పని అని మండిపడ్డారు. తప్పుగా చూపించిన మ్యాప్‌ను వెంటనే సరిచేయాలని ట్విట్టర్ (Twitter) ద్వారా సూచించారు.

శ్మశానంలోని ఊడలమర్రికి వేలాడుతూ దెయ్యాల న్యూఇయర్ సంబురాలు.. పంజాబ్ లో ఘటన.. అసలు ఏం జరిగింది?? వీడియోతో..

న్యూ ఇయర్ సందర్భంగా వాట్సాప్ ఓ వీడియోను రూపొందించి ట్వీట్ చేసింది. ఆ వీడియోలో వాట్సాప్ చూపించిన గ్లోబ్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌తోపాటు చైనా తనదిగా చెబుతున్న కొన్ని భూభాగాలను వాట్సాప్ భారత్ నుంచి మినహాయించింది. నెటిజన్లు ఈ వీడియోపై మండిపడ్డారు. వాట్సాప్‌పై విమర్శలు గుప్పించారు. స్పందించిన కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. వెంటనే తప్పును సరిదిద్దాలని వాట్సాప్‌ను కోరారు. భారత్‌లో వ్యాపారాలు చేసే, కొనసాగాలనుకునే అన్ని ప్లాట్‌ఫాంలు తప్పనిసరిగా సరైన భారత పటాలను ఉపయోగించాలని సూచించారు.

కళ్లు మిరుమిట్లు గొలిపే రీతిలో 2023కి స్వాగతం పలికిన సిడ్నీ నగరం... ఆనందోత్సాహాల్లో హైదరాబాదీలు, వైజాగ్ ప్రజలు.. వీడియోలు ఇవిగో!

వీడియో వివాదాస్పదం కావడంతో స్పందించిన వాట్సాప్ దానిని ట్విట్టర్ నుంచి తొలగించింది. అనుకోకుండా ఈ ఘటన జరిగిందని, లోపాన్ని ఎత్తి చూపినందుకు ధన్యవాదాలను అని పేర్కొంది. ఆ పోస్టును తొలగించామని, క్షమించాలని వేడుకుంది. ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉంటామని మంత్రికి వివరణ ఇచ్చింది.

కొత్త ఏడాది నిరుద్యోగులకు శుభవార్త... మరికొన్ని నోటిఫికేషన్లు విడుదల చేసిన టీఎస్ పీఎస్ సీ

 

(The above story first appeared on LatestLY on Jan 01, 2023 08:02 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).