Mumbai, March 10: దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai) వీధుల్లో (Streets) ఓ చిరుత (Leopard) చక్కర్లు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో (Social media) వైరల్ (Viral) గా మారింది. విషయం తెలుసుకున్న స్థానికులు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. అసలేం జరిగిందంటే.. ముంబై లోని అంధేరి ఈస్ట్ (Andheri East) మరోల్‌లోని భవానీ నగర్‌లోని రెసిడెన్షియల్ ప్లాట్ వద్ద ఈ నెల 7న చిరుత కనిపించింది. వీధిలో అది యథేచ్చగా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అటవీ అధికారులు అక్కడికి చేరుకుని ఆ ప్రాంతంలో పరిశీలించారు.
బైకును వేగంగా ఢీకొట్టిన దిగ్విజయ్ సింగ్ కారు.. ఎగిరిపడిన బైకర్.. వైరల్ వీడియో
#WATCH | Leopard spotted in residential area of Bhawani Nagar in #Andheri East. Forest officials are reportedly checking the location.#Mumbai #Leopard pic.twitter.com/qol66VoMLs
— Free Press Journal (@fpjindia) March 8, 2023
చిరుత జాడను గుర్తించేందుకు పలు ప్రాంతాల్లో ట్రాక్ కెమెరాలు అమర్చారు. స్థానికులకు అది ఎలాంటి అపాయం కలిగించకున్నా ఓ వీధికుక్కపై దాడిచేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నది.
కాగా, ముంబైలో చిరుతలు కనిపించడం కొత్తేమీ కాదు. గతంలో థానే, కల్యాణ్, గోరేగావ్, అంధేరీలలో చిరుతలు కనిపించాయి. ముంబై ఫిలిం సిటీలో ‘బడే మియా చోటే మియా’ షూటింగ్ జరుగుతుండగా నటుడు అక్షయ్ కుమార్ మేకప్ ఆర్టిస్ట్‌పై చిరుత ఒకటి దాడిచేసింది.