Patna, Dec 26: బీహార్ లోని పట్నాకు 70 కిలోమీటర్ల దూరంలో ఉండే బాడ్ పట్టణంలో మై సెకండ్ వైఫ్ రెస్టారెంట్ (My Second Wife Restaurant) అనే హోటల్ ఉంది. హోటల్ కు కొత్తగా పేరు పెట్టాలనుకున్న రంజిత్ కుమార్ అందరిలాగా కాకుండా కాస్తంత వినూత్నంగా ఆలోచించాడు. కొత్తగా పెట్టిన తన హోటల్‌కు ‘మై సెకండ్ వైఫ్ రెస్టారెంట్’ అని పేరు పెట్టారు. పేరుకు తగ్గట్టుగా.. రెండో వివాహం చేసుకున్నవారు ఈ హోటల్‌కు వస్తే రాయితీ (My Second Wife Restaurant Discount) కూడా ఇస్తున్నాడు.
రోడ్డుపై వెళుతున్నవారు ఈ పేరు చూసి హోటల్‌కు వస్తున్నారు. ప్రస్తుతం హోటల్‌లో టీ, బర్గర్లు, నూడుల్స్ వంటి ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచుతున్నట్లు రంజిత్ తెలిపాడు. వేసవి కాలంలో ఐస్‌క్రీమ్‌లు సైతం విక్రయిస్తానని చెబుతున్నాడు. సాధారణంగా ఇంట్లో కంటే ఇక్కడే ఎక్కువ సమయం గడుపుతున్నానని, అందుకే ఈ హోటల్ తన రెండో భార్య వంటిదని రంజిత్ చెప్పాడు. హోటల్‌కు ఇలాంటి పేరు పెట్టడంపై తన కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారని వెల్లడించాడు. అయితే తరువాత వారే అంగీకరించారని వెల్లడించారు.