Hyderabad, Jan 31: తెలంగాణలో (Telangana) రాయితీతో (Discount) ట్రాఫిక్ చలాన్ల (Traffic Challan) చెల్లింపు గడువు నేటితో ముగియనుంది. తొలుత గత ఏడాది డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు రాయితీ చలాన్ల చెల్లింపులకు అవకాశం కల్పించారు. అయితే దీనిని ఆ తర్వాత జనవరి 31 వరకు పొడిగించారు. సాంకేతిక సమస్య కారణంగా రాయితీతో కూడిన చెల్లింపు గడువును పొడిగించారు. అయితే మరోసారి గడువు పొడిగించేది లేదని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాయితీతో కూడిన ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుకు నేడు మాత్రమే గడువు ఉంది.
వాహనదారులకు BIG అలర్ట్.. పెండింగ్ చలాన్ క్లియర్ చేశారా? @INCTelangana #TrafficChallanDiscount #Expires #TeluguNews #DishaDailyhttps://t.co/nzZm1cnSgo
— Disha Telugu Newspaper (@dishatelugu) January 29, 2024
రాయితీలు ఇలా..
బైకులు, ఆటోలకు 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, లారీ వంటి భారీ వాహనాలకు 60 శాతం రాయితీని ప్రకటించారు. రాయితీతో కూడిన ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు వల్ల ఖజానాకు భారీగానే ఆదాయం వచ్చింది.