Rana Daggubati: ఫ్యాన్స్‌ కి షాకిచ్చిన రానా.. కొన్నాళ్లు వాటన్నికిటికీ బ్రేక్ అంటూ సంచలన ప్రకటన.. ఏంటీ విషయం?

సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన రానా.. షాక్ లో అభిమానులు

Rana Daggubati: ఫ్యాన్స్‌ కి షాకిచ్చిన రానా.. కొన్నాళ్లు వాటన్నికిటికీ బ్రేక్ అంటూ సంచలన ప్రకటన.. ఏంటీ విషయం?
Rana (Image Credits: Twitter)

Hyderabad, August 6: ప్రముఖ నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి (Rana Daggubati) కొన్నాళ్ల పాటు సామాజిక మాధ్యమానికి  బ్రేక్‌ ఇవ్వాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని రానా ట్విట్టర్ (Twitter) ద్వారా షేర్‌ చేశారు. ‘పని జరుగుతోంది. సోషల్‌ మీడియా నుంచి కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. సినిమాలతో కలుద్దాం. బిగ్గర్‌.. బెటర్‌.. స్ట్రాంగర్‌’ అంటూ ట్వీట్‌ చేసి అభిమానులకు షాకిచ్చాడు. అయితే, రానా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నా,89డో తెలియాల్సి ఉంది.

స్విట్జర్లాండ్‌ వెకేషన్‌ నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అయిన మహేష్..కొత్త మేకోవార్ లో హల్ చల్

ప్రస్తుతం ఈ దగ్గుబాటి హీరో.. దర్శకుడు గుణశేఖర్‌ (Gunashekar) తో ‘హిరణ్య కశ్యప’, దర్శకుడు మిలింద్‌ రావుతో ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలి సిందే.  అలాగే ‘కోడిరామ్మూర్తి’ బయోపిక్ (Biopic), తేజ దర్శకత్వంలో రానా ఓ సినిమా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక వెంకటేశ్, రానా కలిసి నటించిన ‘రానా నాయుడు’ వెబ్‌ సిరీస్‌ త్వరలో నెట్‌ ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్‌ కానుంది.

 

(The above story first appeared on LatestLY on Aug 06, 2022 09:44 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).