అఖిల్ పెళ్లి వేడుక కోసం అక్కినేని ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతేడాది నవంబర్ 26న జైనాబ్ రావ్‌జీతో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను నాగార్జున ట్విటర్ ద్వారా పంచుకున్నారు. కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు ఓ ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు.

జైనబ్ రావడ్జీతో అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్..అధికారికంగా ప్రకటించిన నాగార్జున

అయితే వీరి పెళ్లి తేదీకి సంబంధించి అక్కినేని ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తాజాగా వీరిద్దరూ ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చారు. కాబోయే భార్యతో కలిసి ఎయిర్ పోర్ట్ లో ఎక్కడికో వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లికి ముందే ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారుగా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

AkhilA kkineni and Zainab Ravdjee Spotted at Airport

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)