Bengaluru Building Collapse Video: వీడియో ఇదిగో, కూలీలు పనిచేస్తుండగానే కుప్పకూలిన బహుళ అంతస్తుల భవనం, శిథిలాల కింద చిక్కుకున్న పలువురు భవన కార్మికులు

కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. భవనంలో కూలీలు పనిచేస్తుండగానే ఒక్కసారిగా కూలిపోయింది. దాంతో పలువురు కూలీలు భవన శిథిలాల కింద చిక్కుకున్నారు. బెంగళూరులోని హొరమావు అగార ఏరియాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Bengaluru Building Collapse Video: వీడియో ఇదిగో, కూలీలు పనిచేస్తుండగానే కుప్పకూలిన బహుళ అంతస్తుల భవనం, శిథిలాల కింద చిక్కుకున్న పలువురు భవన కార్మికులు
Under-Construction Building Collapses in Bengaluru (Photo Credits: X/ @ians_india)

కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. భవనంలో కూలీలు పనిచేస్తుండగానే ఒక్కసారిగా కూలిపోయింది. దాంతో పలువురు కూలీలు భవన శిథిలాల కింద చిక్కుకున్నారు. బెంగళూరులోని హొరమావు అగార ఏరియాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

వీడియో ఇదిగో, పొలంలో మందు పిచికారీ చేస్తున్న రైతుకు పైకి దూసుకొచ్చిన 10 అడుగుల కొండ చిలువ, తర్వాత ఏమైందంటే..

భవనం కుప్పకూలిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు, స్థానిక అధికారులు, రెస్క్యూ టీమ్స్‌ ఘటనా ప్రాంతానికి చేరుకున్నాయి. బాధితులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల తొలగించి బాధితులను బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Bengaluru Building Collapse Videos

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 22, 2024 11:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).