బీహార్ లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే (MLA) షకీల్ అహ్మద్ ఖాన్ (Shakeel Ahmed Khan) ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.రాజధాని పట్నా (Patna) లోని గర్దానీబాగ్ ఏరియా (Gardanibagh area) లోగల ఆయన నివాసంలో ఖాన్ కుమారుడు అయాన్ జహీద్ ఖాన్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఖాన్ కుమారుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పాట్నా పోలీసులు తెలిపారు.
షకీల్ అహ్మద్ ఖాన్ ప్రస్తుతం కతిహార్ జిల్లాలోని కడ్వా అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. ఖాన్ 1992లో ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా కూడా పనిచేశారు. అప్పట్లో ఆయన ఎస్‌ఎఫ్‌ఐలో ఉన్నారు. అనంతరం 1999లో ఖాన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.అంతా అయిపోయిందంటూ తండ్రి కన్నీటి పర్యంతం అయ్యారు.
Ayaan Zahid Khan Dies by Suicide:
#WATCH | Patna, Bihar | Congress leader Dr Shakeel Ahmad Khan's son died allegedly by suicide. Visuals from his Gardanibagh residence. pic.twitter.com/e7IAW8Yr8l
— ANI (@ANI) February 3, 2025
ఆత్మహత్యల నివారణ మరియు మానసిక ఆరోగ్య హెల్ప్‌లైన్ నంబర్‌లు:
టెలి మనస్ (ఆరోగ్య మంత్రిత్వ శాఖ) - 14416 లేదా 1800 891 4416; నిమ్హాన్స్ - + 91 80 26995000 /5100 /5200 /5300 /5400; పీక్ మైండ్ - 080-456 87786; వాండ్రేవాలా ఫౌండేషన్ – 9999 666 555; అర్పిత ఆత్మహత్య నివారణ హెల్ప్‌లైన్ – 080-23655557; iCALL – 022-25521111 మరియు 9152987821; COOJ మెంటల్ హెల్త్ ఫౌండేషన్ (COOJ) - 0832-2252525.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)