Bomb Cyclone Live Video: సుడులు తిరుగుతూ బాంబ్ సైక్లోన్ ఎంత భయంకరంగా ఉందో వీడియో ఇదిగో, పసిఫిక్ మహాసముద్రం వాయవ్య ప్రాంతానికి చేరుకుంటున్న తుపాను

అమెరికాను వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’ తుపాను లైవ్ వీడియో బయటకు వచ్చింది. తుపాను తీవ్ర రూపం దాల్చుతూ పసిఫిక్ మహాసముద్రం వాయవ్య ప్రాంతానికి సమీపిస్తున్న భయానకమైన దృశ్యం ఉపగ్రహం కంటికి చిక్కింది.

Bomb Cyclone Live Video: సుడులు తిరుగుతూ బాంబ్ సైక్లోన్ ఎంత భయంకరంగా ఉందో వీడియో ఇదిగో, పసిఫిక్ మహాసముద్రం వాయవ్య ప్రాంతానికి చేరుకుంటున్న తుపాను
incredible view of the 'bomb cyclone' strengthening and approaching the Pacific Northwest Watch Video

అమెరికాను వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’ తుపాను లైవ్ వీడియో బయటకు వచ్చింది. తుపాను తీవ్ర రూపం దాల్చుతూ పసిఫిక్ మహాసముద్రం వాయవ్య ప్రాంతానికి సమీపిస్తున్న భయానకమైన దృశ్యం ఉపగ్రహం కంటికి చిక్కింది. బాంబ్ సైక్లోన్ భయంకరంగా సుడులు తిరుగుతుండడం ఈ వీడియోలో కనిపించింది. తుపాను కారణంగా వాషింగ్టన్‌లోని లిన్‌వుడ్‌లో చెట్లు విరిగిపడడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

కాలిఫోర్నియాను తాకిన బాంబ్ సైక్లోన్, కరెంట్ లేక అంధకారంలోకి అమెరికాలో పలు రాష్ట్రాలు, తీవ్ర గాలులతో విరుచుకుపడుతున్న తుఫాను

భారీ వర్షాలు భయపెడుతుండగా, విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రభావం ఆరు లక్షల ఇళ్లపై పడింది. వాషింగ్టన్, ఓరెగావ్, కాలిఫోర్నియాలో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. స్కూళ్లు మూతపడ్డాయి. బాంబ్ సైక్లోన్ ప్రభావం కెనడా, బ్రిటిష్ కొలంబియాపైనా పడింది. కెనడాలోని పసిఫిక్ తీర ప్రాంతంలో 2.25 లక్షల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

Bomb Cyclone Live Video:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 21, 2024 12:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).