జ‌మ్మూక‌శ్మీర్ అసెంబ్లీలో వ‌రుస‌గా రెండో రోజు బీజేపీ, ఎన్సీ ఎమ్మెల్యేల‌ మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. ఆర్టిక‌ల్ 370(Article 370)ని పున‌రుద్ద‌రించాల‌ని ఇంజినీర్ ర‌షీద్ సోద‌రుడు, అవామీ ఇతెహ‌ద్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మ‌ద్ షేక్ గురువారం బ్యానర్‌ను ప్ర‌ద‌ర్శించిన విష‌యం తెలిసిందే. అయితే అసెంబ్లీ స‌మావేశాల‌ను అడ్డుకుంటున్న ఖుర్షీద్‌ను ఇవాళ మార్ష‌ల్స్ బ‌య‌ట‌కు ఈడ్చుకెళ్లారు. బెంచ్‌ల మ‌ధ్య నినాదాలు చేస్తున్న ఖుర్షీద్‌ను మార్ష‌ల్స్ బ‌ల‌వంతంగా లాక్కెళ్లారు. పీడీపీకి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. మ‌రో వైపు ఆర్టిక‌ల్ 370 ర‌ద్దును స‌మ‌ర్థిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. దీంతో అసెంబ్లీ ర‌చ్చ‌రచ్చ‌గా మారింది. జ‌మ్మూక‌శ్మీర్‌కు ప్ర‌త్యేక హోదా క‌ల్పించే 370 ఆర్టిక‌ల్‌ను మోదీ స‌ర్కారు ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ ఆర్టిక‌ల్‌ను పున‌రుద్ద‌రించాల‌ని జ‌మ్మూక‌శ్మీర్ ప్ర‌భుత్వ తీర్మానం ప్ర‌వేశ‌పెట్టింది.

ఆరు నూరైనా ఆర్టికల్ 370ని పునరుద్ధరించే ప్రశ్నే లేదు, మహా ఎన్నికల్లో కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ

Ruckus Over Article 370 Continues

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)