హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీ కంగనా రనౌత్‌ను గురువారం చండీగఢ్ విమానాశ్రయంలో చెప్పుతో కొట్టి దుర్భాషలాడిన సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌ను సీఐఎస్‌ఎఫ్ కమాండెంట్ ఆఫీస్‌కు తరలించి విచారణ చేపట్టారు. అనంతరం సస్పెన్షన్ విధించారు. కాగా పంజాబ్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను 'ఖలిస్థానీలు' అని కంగనా పేర్కొన్నందుకు మహిళా కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టారు.
సస్పెండ్ కాబడిన మహిళా కానిస్టేబుల్ మాట్లాడుతూ.. రైతులు అక్కడ రూ. 100కి కూర్చున్నారని ఆమె స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఆమె ఈ స్టేట్‌మెంట్ ఇచ్చేటప్పుడు నా తల్లి అక్కడే కూర్చుని నిరసన వ్యక్తం చేస్తోంది” అని కౌర్ తెలిపారు. ఈ ఘటనపై కంగనా మాట్లాడుతూ.. తాను క్షేమంగా ఉన్నానని, అయితే పంజాబ్‌లో తీవ్రవాదం, ఉగ్రవాదం పెరిగిపోవడంపై కంగనా ఆందోళన వ్యక్తం చేసింది.
Here's Video
#KanganaRanaut slapped by a CISF constable, Kulwinder Kaur. She was reportedly upset with Kangana's comments on farmers.
Despicable way of expressing ideological differences, especially when you're wearing a uniform! pic.twitter.com/EH4DRqbKJu
— Roop Darak (Modi Ka Parivar) (@RoopDarak) June 6, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)