బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో గురువారం అర్ధరాత్రి పోర్షే కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి కేబీఆర్ పార్కు ప్రహరీ గోడను ఢీకొట్టింది. కేబీఆర్ పార్క్ ఫుట్ పాత్ దాటి ప్రహరీ గోడ గ్రిల్‌ను ధ్వంసం చేసి చెట్టును ఢీకొట్టి కారు ఆగిపోయింది. ప్రమాదం అనంతరం డ్రైవర్ కారును వదిలి అక్కడి నుంచి పరారయ్యాడు. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు క్రేన్ సాయంతో కారును అక్కడి నుంచి తొలగించారు. ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Porsche Car Crash in Hyderabad:
A #speeding #Porsche car lost its control and rams into a tree and the boundary wall of #KBRpark in #BanjaraHills in #Hyderabad on early Friday.
The driver fled the spot after the incident, police suspecting that the driver might be under the influence of the alcohol. A case has… pic.twitter.com/tgiQ01pLjV
— Surya Reddy (@jsuryareddy) November 1, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)